విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. తన పర్సనల్ విషయాలపై బోల్డ్ గానే కామెంట్స్ చేస్తుంటారు. తన కాస్మెటిక్ సర్జరీల విషయాలను ఎలాంటి బెరుకు లేకుండా షేర్ చేసుకుటారు. లేటెస్ట్ గా మరోసారి తన ముక్కుకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి, ఆ నిర్ణయం వెనుక గల కారణాలను శృతిహాసన్ సూటిగా చెప్పారు.
టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. నా, ముఖం ఆకర్షణీయంగా కనిపించడానికి ఫిల్లర్స్ కూడా వాడాను. ఈ విషయాలు దాచాల్సిన అవసరం నాకు కనిపించలేదు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాను. కొందరు ఇలాంటివి బయటకు చెప్పడానికి ఇష్టపడరు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను. అలాగే, నా విషయాలను ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది. అదేం తప్పు కాదు. ఇకముందు కూడా అవసరమైతే ఫేస్‌లిఫ్ట్ కూడా చేయించుకోవాలి అని అనుకుంటున్నాను. ఇది పూర్తిగా నా నిర్ణయమే. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు, నా శరీరం గురించి నేను తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నా బాడీ నా ఇష్టం అని విమర్శించేవారికి ఇచ్చిపడేశారు. శృతి లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
Also read: పితృ తర్పణాలకు జ్యేష్ఠ అమావాస్య
Also read: నా కూతురు జోలికొస్తే.. కారుతో ఢీకొడతా: కాజోల్
Also read: ‘ది రాజా సాబ్’ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ లో కోత