డెడ్ ఎకానమీ కామెంట్స్ పై అమెరికాలోనే వ్యతిరేకత
భారత ఆర్థిక వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ చేసిన “డెడ్ ఎకానమీ” కామెంట్స్ కి భారత్ లోనే కాక, అమెరికాలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ కామెంట్స్ తో ట్రంప్ అహంకారంతో చేసినవి అంటురన్నారు. అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహాలకు విరుద్ధంగా మాట్లాడారని అంతర్జాతీయ నిపుణులు మండిపడుతున్నారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న…
భారత్ పై ట్రంప్ ఏ అహంకారంతో ఈ కామెంట్స్ చేశారు… భారత్ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి రైజింగ్ లో ఉంది… ప్రపంచ బ్యాంక్, IMF లాంటి సంస్థలు ఏమంటున్నాయి…
ఇండియాది డెడ్ ఎకానమీయా ? ట్రంప్ కు ఎంత బలుపు ??
భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ “డెడ్ ఎకానమీ” కామెంట్స్ పై అమెరికాలోనే వ్యతిరేకత వస్తోంది… ఎకనామిక్ ఎక్స్ పర్ట్స్ భారత్‌కు మద్దతు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను “డెడ్ ఎకానమీ”గా అనడమే కాకుండా… భారత్ దిగుమతులపై 25% టారిఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కామెంట్స్ పై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది… ఒక్క రాహుల్ గాంధీ నుంచి తప్ప… కాంగ్రెస్ అగ్రనేత, ది గ్రేట్ అపోజిషన్ లీడర్… రాహుల్ గాంధీ మాత్రమే ట్రంప్ కామెంట్స్ ను సమర్థిస్తూ, అవును… ఇండియన్ ఎకానమీ… డెడ్ ఎకానమీ…
ఇది ప్రపంచమంతా తెలిసిన వాస్తవం. మోడీ సర్కారు ఆర్థిక విధానాలు విఫలమయ్యాయి,” అని కామెంట్స్ చేశారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులతో పాటు ఇండియా కూటమి మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, “భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ కాదు. ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి,” అని అన్నారు. శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది, ట్రంప్ వ్యాఖ్యలను “అహంకారం లేదా అజ్ఞానం” నుంచి వచ్చినవిగా విమర్శించారు.
భారత్ 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ
భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ట్రంప్ కామెంట్స్ ని తిప్పికొట్టారు. “భారత్ ఒక దశాబ్దంలో ‘ఫ్రాజిల్ ఫైవ్’ నుంచి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది… అని గోయల్ అన్నారు. భారత్ యొక్క ఆర్థిక వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 16% సహకారం అందిస్తోంది… ఇది ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా గుర్తించబడిందని గోయల్ తెలిపారు. మరి రాహుల్ గాంధీకి… ఎన్డీఏ కాబట్టి విమర్శించాలి అనుకున్నారే తప్ప… వాడెవడొ కౌన్ కిస్కా… భారత్ ను తిడుతుంటే… ఎందుకు వ్యతిరేకించలేదు అన్న కోపం అయితే వస్తోంది. అటు అమెరికాలోని నిపుణులు కూడా ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. భారత్‌ను ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా గుర్తిస్తూ, ఈ వ్యాఖ్యలు భౌగోళిక రాజకీయ దృష్ట్యా తప్పుడు కామెంట్స్ అన్నారు. అసలు భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది… నిజాలు ఏంటి అన్నది మీకు ప్రూఫ్స్ తో సహా వివరిస్తాను. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డేటా ప్రకారం, భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. 1995 నుంచి 2025 వరకు భారత్ యొక్క GDP దాదాపు 12 రెట్లు పెరిగింది… ప్రస్తుతం 4.19 ట్రిలియన్ డాలర్లతో …. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. IMF అంచనాల ప్రకారం, 2030 నాటికి భారత్…. జర్మనీని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. 2025-26లో భారత్ GDP వృద్ధి రేటు 6.4%గా ఉంటుందని,
ఇది అమెరికా (2.0%) కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని IMF అంచనా వేసింది. ఈ లెక్కలు చూస్తే… ట్రంప్ కామెంట్స్ అహకారంతో చేసినవి అని స్పష్టంగా అర్థమవుతోంది.
అమెరికాలో ఆర్థిక నిపుణుల నుంచి విమర్శలు
ట్రంప్ వ్యాఖ్యలను అమెరికాలోని కొందరు ఆర్థిక నిపుణులు తప్పుబట్టారు. మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ టెస్ట్‌బెడ్ అధ్యక్షుడు కిర్క్ లుబిమోవ్, ఈ వ్యాఖ్యలను “పెద్ద భౌగోళిక రాజకీయ తప్పు”గా అభివర్ణించారు. చైనా యొక్క పెరుగుతున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి అమెరికాకు భారత్ ఒక కీలక మిత్రదేశంగా ఉంంది. టారిఫ్స్ విధించడం ద్వారా అమెరికా తన మిత్రదేశాన్ని దూరం చేసుకుంటోందని ఆయన హెచ్చరించారు. “భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇది త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది,” అని లుబిమోవ్ అన్నారు. ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ కూడా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. గత ఏడాది అమెరికా కంటే భారత్ రెండు రెట్లు వేగంగా వృద్ధి చెందింది. ఈ ఏడాది మూడు రెట్లు వేగంగా డెవలప్ అవుతుందని ఆయన డేటాతో సహా వివరించారు.
భారత్ పై టారిఫ్స్ ప్రభావం ఏంటి
ట్రంప్ ప్రకటించిన 25% టారిఫ్స్ భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఔషధాలు, రత్నాలు, వస్త్రాలు, ఇండస్ట్రియల్ మెషినరీ లాంటి భారత్ యొక్క ప్రధాన ఎగుమతి రంగాలు
ఈ టాక్సుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. నోమురా, బార్క్లేస్ లాంటి బ్రోకరేజ్ సంస్థలు … ఈ ట్యాక్సుల వల్ల భారత GDP వృద్ధి 20-30 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని హెచ్చరించాయి. అయినప్పటికీ, భారత్ యొక్క తక్కువ కార్మిక వ్యయం, యువ జనాభా, డిజిటల్ పేమెంట్ ఫ్రేమ్‌వర్క్ లాంటి ప్రయోజనాలు దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా-భారత్ సంబంధాలపై ప్రభావం
ట్రంప్ వ్యాఖ్యలు, టారిఫ్స్ అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈమధ్య రెండు దేశాలు కీలక రంగాలైన రక్షణ, అంతరిక్షం, రేర్ ఎర్త్ మైన్స్ లో సహకారాన్ని పెంచుకున్నాయి. ఉదాహరణకు, ISRO, NASA సంయుక్తంగా NISAR శాటిలైట్‌ను ప్రయోగించాయి. ఈ టైమ్ లో ట్రంప్ వైఖరి అమెరికా యొక్క విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరగా ఇంకో మాట…. ఇది అందరూ జాగ్రత్తగా వినాలి. పాటించాలని చేతులెత్తి కోరుకుంటున్నా… భారతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి స్వదేశీ ఉద్యమానికి ప్రధానమంత్రి మోడీ పిలుపు ఇచ్చారు. ట్రంప్ యొక్క “డెడ్ ఎకానమీ” కామెంట్స్ … 25% టారిఫ్స్ పై భారత ఆర్థిక వ్యవస్థపై తాత్కాలిక సవాళ్లను ఎదుర్కుంటున్న టైమ్ లో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, వాటిని కొనుగోలు చేయాలని ఉత్సాహవంతంగా పిలుపునిచ్చారు. “స్వదేశీ ఉద్యమం మన ఆర్థిక శక్తిని పెంపొందించడమే కాక, ప్రపంచ వేదికపై భారత్ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తే దేశభక్తి ఉద్యమం,” అని మోడీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద, స్థానిక తయారీదారులు, చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లను బలోపేతం చేయడం ద్వారా భారత్ తన ఆర్థిక స్వావలంబనను సాధించగలదని ఆయన అన్నారు. గతంలో ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా స్థానిక ఉత్పాదనకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చింది. ఇప్పుడు ప్రతి భారతీయుడు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచాలని కోరింది. “ప్రతి స్వదేశీ కొనుగోలు ఒక భారతీయ కుటుంబానికి జీవనోపాధిని, దేశానికి గర్వాన్ని అందిస్తుంది,” అని మోడీ విశ్వాసంతో ప్రకటించారు. ఈ సందర్భంలో, భారతీయులు దేశీయ బ్రాండ్లను ఆదరించడం ద్వారా విదేశీ టారిఫ్స్ సవాళ్లను అధిగమించి, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యాన్ని సాకారం చేయాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ దేశభక్తి ఉద్యమం భారత్‌ను కేవలం ఆర్థిక శక్తిగానే కాక, స్వాభిమానం, స్వావలంబన యొక్క ప్రతీకగా నిలబెట్టే అవకాశం ఉంది…
సో… దయచేసి అమెరికా వస్తువులను కొనడం మానేసి… ఇండియన్ ప్రొడక్ట్స్ కొందాం… మన వ్యాపారులు, మన తయారీదారులకు ప్రోత్సాహం కల్పిద్దాం.
జై హింద్… భారత్ మాతాకి జై….
Read also : ట్రంప్-మోడీకి ఎక్కడ చెడింది?
Read also : Best Choice for SBI Credit Card – Huge profit from Amazon Festival
Read also : పాతికేళ్ళకే గుండె పోటు : కుప్పకూలుతున్న యువత