ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?

Latest Posts NRI Times

Trump Third Term: అమెరికా రాజ్యాంగం (US Constitution Amendment) అనుమతించేది రెండుసార్లే. అయినా తనకు బోలెడు దారులున్నాయన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). 2028లో అధ్యక్ష బరిలో వాన్స్ (Trump 2028 Election), రన్నింగ్మేట్గా ట్రంప్ (Vice President Role). నెగ్గాక వాన్స్ రాజీనామా చేస్తే మూడోసారి పీఠంపై ట్రంప్ అని అంచనా. ఈ ఆలోచన ఉందని ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. సాధ్యాసాధ్యాలపై రాజ్యాంగ నిపుణులు (US Constitutional Experts) అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Trump

ట్రంప్ యొక్క మూడోసారి అధ్యక్ష పీఠం ఆకాంక్ష ఒక కొత్తదేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం (US Presidential Campaign) సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘మూడుసార్లు కాదు, నాలుగు సార్లు కూడా దేశానికి సేవ చేయడం నాకు గౌరవప్రదం’ అని ట్రంప్ చెప్పడం కేవలం జోక్ కాదని స్పష్టం చేశారు. (Trump Reelection Campaign)

రాజ్యాంగాన్ని సవరణ తప్పదు (US Constitution Amendment)

అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడం నిషిద్ధం. (Presidential Term Limit) రెండుసార్లు పదవి చేపట్టిన వ్యక్తి మూడోసారి పోటీ చేయాలంటే రాజ్యాంగ సవరణ (Constitutional Amendment) తప్పనిసరి. అయితే, ఇది సాధ్యపడటం చాలా కష్టం. (Impeachment Process) రాజ్యాంగ సవరణ కోసం కాంగ్రెస్ ఉభయ సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆపై 50 రాష్ట్రాల్లో 38 రాష్ట్రాల ఆమోదం అవసరం. (US Congress Approval)

ఉపాధ్యక్ష పదవి చేపడితే (Vice President Role)

అధ్యక్ష పదవికి రెండుసార్లు ఎన్నిక కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేదిస్తోంది. (22nd Amendment) కానీ, వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై ఏమి ప్రస్తావించలేదు. (Presidential Succession Act) అందువల్ల ట్రంప్ ఉపాధ్యక్ష పదవిని చేపట్టి, ఆపై అధ్యక్షుడి రాజీనామా ద్వారా మూడోసారి అధ్యక్షుడు కావచ్చు అనే ఆలోచన తెరపైకి వచ్చింది. (Trump Political Strategy)

గతంలో ఏం జరిగింది? (US Presidential Election History)

అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్డ్ (Franklin D. Roosevelt Presidency) మాత్రమే నాలుగుసార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 32వ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి, 1945లో మరణించేవరకు అధికారంలో ఉన్నారు. (Longest Serving US President) తర్వాతే 1961లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. (22nd Amendment Ratification)

ట్రంప్ మూడోసారి: అభిప్రాయాలు (Public Opinion on Trump Third Term)

విపక్ష డెమోక్రాట్లు (Democratic Party) ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి ముప్పుగా భావిస్తున్నారు. రిపబ్లికన్లు (Republican Support) కూడా ట్రంప్ మూడో టర్మ్ ఆలోచనపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఈ అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. (US Political Debate)

Read this also :  రాత్రిళ్ళు చపాతీలు తింటున్నారా? కాస్త ఆగండి !

Read this also : Tattoos Cancer: టాటూలతో క్యాన్సర్ ముప్పు! Black Color అస్సలొద్దు !!

Tagged