అమెరికాలో ప్రతి యేటా నవంబర్ 11నాడు వెటరన్స్ డే నిర్వహిస్తారు. United states Armed forces లో పాల్గొన్న సైనికుల గౌరవార్థంగా ఈ రోజును వెటరన్స్ డేగా నిర్వహిస్తారు. ఇది యుద్ధ విరమణ దినం అంతేకాదు… గౌరవ సైనికుల త్యాగాలను తలుచుకునే రోజు. ఈ రోజంతా అమెరికాలో సెలవు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వార్షికోత్సవం సందర్భంగా దీన్ని నిర్వహిస్తారు. జర్మనీతో యుద్ధ విరమణ అమల్లోకి వచ్చిన 1918 నవంబర్ 11న 11వ గంటలో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. యుఎస్ వెటరన్ సంస్థల డిమాండ్ తో 1954లో యుద్ధ విరమణ దినోత్సవాన్ని వెటరన్స్ డేగా మార్చారు.
ఇవాళ అమెరికాలో Federal Holiday. ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, బ్యాంకులకు సెలవు. ఇవాళ ఏవి తెరుస్తారు… వేటిని మూసి ఉంచుతారో చూద్దాం.
Retail Markets
ఇవాళ మేజర్ రిటైల్ మార్కెట్ల్ అయిన Target, Walmart, Krogerతో పాటు మిగతా సంస్థలు కూడా తెలరిచే ఉంటాయి. చాలా మార్ట్ లు, రిటైలర్స్, రెస్టారెంట్స్ ఇవాళ వృద్ధులకు ఆఫర్లు, గిఫ్టులు ప్రకటించాయి. డ్రింక్స్, పిజ్జాలు, ఫ్రీ మీల్స్ అందిస్తున్నాయి. మిలటరీలో పనిచేసిన రిటైర్డ్ అయిన వారికి, ప్రస్తుతం పనిచేస్తున్న వారికి ఇలాంటి ఉచిత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
Financial Services
నవంబర్ 11 ఫెడరల్ హాలిడే కావడంతో Fargo, Bank of America, Citibank and TD Bank బ్రాంచ్ లు మూసి ఉంటున్నాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కూడా మూసే ఉంటుంది. అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్, నాస్ డాఖ్ మాత్రం Veterans Day నాడు ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి.
Postal Services
UPS ఇవాళ తమ లావాదేవీలను నిర్వహిస్తోంది. అలాగే FedEx కొరియర్ సర్వీస్ కూడా వెటరన్స్ డే నాడు తమ కార్యకలాపాలను యధావిధిగా నిర్వహిస్తోంది. USPS మాత్రం ఈ సోమవారం నాడు డెలివరీలను బంద్ పెట్టింది.
Government Services
చాలా వరకూ అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ సర్వీసులు ఇవాళ హాలిడే ప్రకటించాయి. DMVలు, లోకల్ లైబ్రరీలు కూడా మూసే ఉంటాయి.