లక్ష స్కూటర్‌కు రూ.14 లక్షల నంబర్ ప్లేట్ !
హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఒక సూపర్ డూపర్ కామెడీ ఇది. ఇష్టాల కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెడతారంటే ఇదేనేమో. హమీర్‌పుర్‌కు చెందిన సంజీవ్ కుమార్ ఒక కొత్త స్కూటర్ కొన్నాడు. అది కూడా లక్ష రూపాయల స్కూటర్, అంతే! కానీ, ఈ స్కూటర్‌కి జనరల్ గా వచ్చే నంబర్ ప్లేట్ ఎందుకు? VIP నంబర్ కావాలి, స్టైల్‌గా తిరగాలి అనుకున్నాడు. అంతే, హిమాచల్ రవాణా శాఖ ఆన్‌లైన్ వేలంలో ఎంట్రీ ఇచ్చాడు. HP 21C 0001 ఇది ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలుసా? ఏకంగా 14 లక్షల రూపాయలు! లక్ష రూపాయల స్కూటర్‌కి రూ.14 లక్షల నంబర్ ప్లేట్! ఇదేం లాజిక్ భయ్యా అనుకుంటున్నారా ?
స్కూటర్ ధర కంటే 14 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాడు, కేవలం నంబర్ ప్లేట్ కోసం! ఇది చూస్తే, “భయ్యా, ఈ డబ్బుతో లగ్జరీ కారు కొనొచ్చు, లేదా 14 స్కూటర్లు కొని షోరూమ్ ఓపెన్ చేయొచ్చు!” అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఒకతను “పావలా కోడికి బారనా మసాలా!” అని సెటైర్ వేశాడు. సంజీవ్ భాయ్ అంటే మజాకానా ?
ఇంకో విశేషం ఏంటంటే, ఈ వేలంలో సంజీవ్ ఒక్కడే కాదు, మరో భాయ్ కూడా ట్రై చేశాడు. సోలన్‌కి చెందిన అతను, 13 లక్షల 50 వేలు దాకా బిడ్ వేశాడు. కానీ, సంజీవ్ మాత్రం, ఇంకో 50 వేలు ఎక్కువ వేసి ఆ ఫ్యాన్సీ నంబర్ కొట్టేశాడు. మొత్తానికి ఈ డ్రామాతో హిమాచల్ ప్రభుత్వం పండగ చేసుకుంది. 14 లక్షలు ఖజానాలో జమ అయ్యాయి. రవాణా శాఖ అధికారుతే, వేలంలో ఇంత ఖరీదైన నంబర్ ప్లేట్ కొనడం ఇదే ఫస్ట్! అంటూ సెల్ఫీలు దిగుతున్నారు. సంజీవ్ కుమార్‌ని అడిగితే, “నా టేస్ట్ కి రేటు కట్టొద్దు భయ్యా… అని ఫిలాసఫీ చెబుతున్నాడు. కుటుంబం, ఫ్రెండ్స్, మీడియాతో కలసి సంబరం చేసుకుంటున్నాడు. కానీ నెటిజన్లు మాత్రం వదలట్లేదు. “14 లక్షలతో స్కూటర్ కొని, మిగిలిన డబ్బుతో ఊరంగా బిర్యానీ పార్టీ పెట్టొచ్చు కదా అని తెగ ట్రోల్ చేస్తున్నారు.
Also read: మెగా హీరోలకు కలిసొచ్చిన నెల.. హరిహర వీరమల్లుకు వర్కవుట్ అవుతుందా?
Also read: ఎన్ని సర్జరీలైనా చేయించుకుంటా.. నాఇష్టం: శృతిహాసన్
Also read: పితృ తర్పణాలకు జ్యేష్ఠ అమావాస్య
Also read: http://mypunepulse.com/he-spent-₹14-lakh-for-a-number-plate-on-a-scooter-worth-₹1-lakh/