సీఎం కాన్వాయ్ కే.. నీళ్లు కలిపిన డీజిల్

Latest Posts Trending Now

సీజ్ ద బంక్..

రోడ్డు మీదే ఆగిపోయిన 19 వాహనాలు
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ కు చేదు అనుభవం

కల్తీ పెట్రోల్.. కల్తీ డీజిల్ గురించి మనం చాలా సార్లు వింటుంటాం.. ఒక్కో సారి పెట్రోల్ బంకులు చేసే మోసాలు మనకు అనుభవంలోకి కూడా వచ్చే ఉంటాయి. ఈ సారి ఏకంగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కే షాకిచ్చింది ఓ పెట్రోల్ బంక్.. ఇన్నాళ్లూ.. సామాన్యులకే కల్తీ డీజిల్ అమ్మిన ఆ బంక్ నిర్వాహకులు.. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ కే కల్తీ డిజిల్ కొట్టేశారు. దాంతో వారి పాపం పండింది. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది.

మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లా, దోసీగావ్‌లోని శక్తి ఫ్యూయల్స్ పెట్రోల్ పంప్ ఉంది. అక్కడ భారత్ పెట్రోలియం కంపెనీ డీజిల్ అమ్ముతారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రత్లాంలో జరిగే MP రైజ్ 2025 కాన్‌క్లేవ్ లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం రత్లాంకు వెళ్తారు. ఈ కాన్వాయ్‌లోని 19 ఇన్నోవా వాహనాలు ఇండోర్ నుండి రత్లాం వెళ్తున్న సమయంలో మధ్యలో పెట్రోల్ పంప్ వద్ద డీజిల్ నింపుకున్నాయి. డీజిల్ నింపిన కొద్ది దూరం తర్వాత, కాన్వాయ్‌లోని 19 ఇన్నోవా వాహనాలు ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. కొన్ని వాహనాలు పెట్రోల్ పంప్ వద్దనే ఆగిపోగా మరికొన్ని హైవేపై కొంత దూరం వెళ్లిన తర్వాత ఆగిపోయాయి.

ఏమయిందా అని డీజిల్ ట్యాంకులను తనిఖీ చేసినప్పుడు, డీజిల్‌లో సుమారు 50 శాతం నీరు కలిసి ఉన్నట్లు గుర్తించారు. 20 లీటర్ల డీజిల్‌లో సుమారు 10 లీటర్లు నీరు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కలుషిత డీజిల్ వల్ల వాహనాల ఇంజన్లు పనిచేయడం ఆగిపోయాయి. కాన్వాయ్ లోని వాహనాలు ఆగిపోవడంతో, అధికారులు ఇండోర్ నుండి ప్రత్యామ్నాయ వాహనాలను త్వరగా ఏర్పాటు చేశారు. కాన్వాయ్ వాహనాలను డ్రైవర్లు , పెట్రోల్ పంప్ సిబ్బంది లాక్కెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కాన్వాయ్ లోని వాహనాలే.. ఆగిపోవడంతో చిర్రెత్తుకొచ్చిన సీఎం.. వెంటనే సీజ్ ద బంక్ అని ఆర్డర్లివ్వడం.. వెంటనే అధికారులు.. రంగంలోకి దిగి బంక్ ను సీజ్ చేయడం జరిగింది.

Also read: తమిళనాడులో పవర్ స్టార్ సునామీ

Also read: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్

Also read: మీ మనసు నాకు తెలుసు : రోబో చిట్టికి బాప్

Also read: https://www.msn.com/en-in/news/India/water-mixed-diesel-halts-mp-cm-mohan-yadavs-convoy-as-19-vehicles-break-down-what-went-wrong/ar-AA1HxIty

Tagged

Leave a Reply