చాలామంది మీ ఇంట్లో గానీ… లేదంటే మీ స్నేహితులు, బంధువులు నుంచి గానీ ఇలాంటి ప్రశ్నలు వచ్చే ఉండవచ్చు. అలాంటి వారికి సమాధానమే ఈ ఆర్టికల్. అంతేకాదు… అందుకు సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం.
ఏడాది మొత్తంలోమనం ఎన్నో పండుగలు, పూజలు చేసుకుంటాం. ప్రతి పండక్కి అర్థం పరమార్థం ఉంటుంది….ఈ కార్తీకమాసం నెల రోజులు కూడా ప్రత్యేకమే. శివ కేశవులకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. వీరిని పూజించడం వెనుక దైవభక్తి మాత్రమే కాదు…. ఈ నెలలో మన హిందువులు ఆచరించే ప్రతి క్రియ వెనుకా ఆరోగ్య రహస్యం కూడా ఉందని పెద్దలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే… కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కార్తీక స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే… సూర్యుడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా అక్కడక్కడా మిణుకు మిణుకు మంటూ ఉన్న సమయంలోనే… కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని పండితులు చెబుతారు. ఏడాది మొత్తం మీరు ఇలా చేసినా…… కార్తీకం నెలరోజులూ సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుందని గమనించండి.
అదేంటి అంటే…
సహజంగానే కార్తీక మాసం అంటే చలి మొదలైన సమయం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉంటాడు. అంటే సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ఈ మాసం… మనిషి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. మనం తిన్నటువటి ఆహారపదార్థాలు త్వరంగా జీర్ణం కావు. అంటే ఈ కాలంలో జీర్ణ శక్తి తగ్గుతుంది. చాలామందికి చురుకుదనం తగ్గుతుంది… ముఖ్యంగా బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు కూడా పెరుగుతాయి. వృద్ధులు అయితే ఇంకా ఇబ్బంది పడుతుంటారు. చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల కూడా ఇలాంటి నొప్పులు సహజంగానే పెరుగుతాయి. ఈ బాధలు అన్నింటి నుంచి ఉపశమనం పొందడానికి కార్తీక స్నానం చేయడం అవసరం. అంటే ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులూ ఈ నియమం పెట్టారని … మనం సైంటిఫిక్ గా కూడా అనుకోవచ్చు. కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవపూజలు పూర్తి చేశాం అనుకోండి…చలికాలం అయినా… మనకు అప్పటికే బద్ధకం వదిలి రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటాం. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది.
నదీ స్నానం చేయాలంటే నది వరకూ నడుస్తూ వెళ్ళాలి… ఇది కూడా వ్యాయామమే కదా… అలాగే ప్రవహించే నదుల్లో సహజంగా వుండే ఔషధాలతో పాటు… నదీ పరీవాహక ప్రదేశాల్లో ఉండే చెట్ల ద్వారా ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీళ్ళల్లో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం అని మనం గమనించాలి. కార్తీక స్నానం చేసి… దీపాలు నదిలో వదులుతున్న దృశ్యాలను ఒక్కసారి ఊహించుకోండి… మీ మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందో.
నవంబరు నెల నాటికి వర్షాలు కూడా తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి… వాటిలో మలినాలు అడుగుకి చేరతాయి. దాంతో మనకు నిర్మలమైన నీటి ప్రవాహం కనిపిస్తుంది. మీరు మీ ఇళ్ళ దగ్గర చెరువుల్లో వీటిని గమనించలేకపోవచ్చు. కానీ సాధారణంగా చాలామంది కార్తీకమాసంలో అడవులు, మామిడి తోటల్లో వనభోజనాలకు వెళ్తుంటారు. అప్పుడు అక్కడ వాగులు, వంకల్లో ఇలాంటి స్వచ్ఛమైన నీటిని మీరు చూడవచ్చు. సమృద్ధిగా, స్వచ్ఛంగా ఉన్నటువంటి ఇలాంటి నీటిలో స్నానం చేయాలంటే అందుకు కార్తీక మాసమే అనువైన సమయం అని గుర్తుపెట్టుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం… నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుడి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలు పడి…. ఔషధులు కలిసి రాత్రంతా ఉన్న ఆ నీటిలో మనం ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా మన దగ్గరకు రావు. మన శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే ఈ స్నానం యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఆ ఉష్ణశక్తి ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా జరిగితేనే మనం ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను “Electro Magnetic Activity” అంటారు.
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అది మీ అందరికీ తెలుసు. మన పురాణాల్లో… పూర్వం రుషుల ఆశ్రమాల్లో నదీ స్నానాలు చేసిన సన్నివేశాలు కోకొల్లలు. అంతెందుకు … మన ఆదికావ్యం రామాయణంలో… సీతమ్మ వారు… శ్రీరామ చంద్రమూర్తి… కొండలు, గుట్టల మధ్య కొలువుదీరిన తటాకాల్లో ఉదయాన్ని స్నానాలు చేయడం… పూజలు చేసుకోవడం మనం చదవలేదా ? అలాగే కార్తీక మాసం…. పుష్కారాల సమయం… ఈ రెండు సందర్భాల్లో నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో మాత్రమే సముద్ర స్నానాలు చేస్తుంటాం. ఎప్పుడు పడితే అప్పుడు ఈ సముద్ర స్నానాలు చేయకూడదు అనే నియమం కూడా ఉంది. అలాగే నదీ స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలను కూడా శాస్త్రం చెబుతోంది. రాత్రి వేసుకున్న బట్టలతో నదుల్లో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేయరాదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన తర్వాతే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వస్త్రాలను నీటిలో ఉతకడం లాంటి పనులు చేయరాదు. అంటే… మనం స్నానం చేసిన నీటిని అపరిశుభ్రం చేసే చర్యలు ఏవీ కూడా చేయరాదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి…
ఇదండీ కార్తీక మాసంలో నదీ స్నానాల యొక్క గొప్పతనం.
మీరంతా మన మహర్షి భక్తి పీఠం ఛానెల్ ను subscribe చేసుకోండి. మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయండి.
సర్వే జనా సుఖినో భవంతు…
నమస్కారం.