చాలామంది యూట్యూబ్ లో హెల్త్ కి సంబంధించి వచ్చే రీల్స్, షార్ట్స్ చూసి గుడ్డిగా ఫాలో అవుతున్నారు… మన శరీరానికి అన్ని రకాల పోషకాలు కావాలి – కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్… ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కానీ, యూట్యూబ్‌లో కనిపించే కొన్ని డైట్ ప్లాన్లు చూసి, “జ్యూస్ మాత్రమే తాగితే బరువు తగ్గుతారు… అనో, “పచ్చి కూరగాయలు, మొలకలు తింటే సన్నబడతాం” అనో గుడ్డిగా నమ్మితే ప్రమాదమే! తమిళనాడులో 17 ఏళ్ల శక్తిశ్వరన్ అనే యువకుడు ఇలాంటి ఓ యూట్యూబ్ డైట్ ప్లాన్‌ని అనుసరించి, చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన మనకు పెద్ద గుణపాఠం…

శక్తిశ్వరన్ ఎవరు… అతనికి ఏమైంది ?
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, కొలచెల్‌లో నివసించే 17 యేళ్ళ శక్తిశ్వరన్ ఆరోగ్యంగా ఉండేవాడు… చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అయితే ఆయన కాలేజీలో చేరే ముందు బరువు తగ్గాలని అనుకున్నాడు…అంతే… యూట్యూబ్‌లో చూసిన ఓ వీడియో స్ఫూర్తితో, మూడు నెలలుగా కేవలం పండ్ల రసాలు, నీళ్లు మాత్రమే తీసుకుంటూ వచ్చాడు.. ఘన ఆహారాన్ని పూర్తిగా మానేశాడు. ఇంకా, కొన్ని మందులు వాడటం, వ్యాయామం కూడా మొదలుపెట్టాడు. కానీ, ఈ డైట్‌ని మొదలుపెట్టే ముందు ఒక్క డాక్టర్‌ని కూడా సంప్రదించలేదు. డైటీషియన్ సలహా కూడా తీసుకోలేదు… పోయిన గురువారం రోజు… అతని కుటుంబం ఇంట్లో ఓ పూజా చేసుకుంది. చాలా నెలల తర్వాత మొదటిసారి శక్తిశ్వరన్ ఘన ఆహారం తిన్నాడు.
కానీ, ఈ ఆహారం అతని శరీరానికి డైజేషన్ కాలేదు. దాంతో వాంతులు మొదలయ్యాయి… శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.. వెంటనే శక్తీశ్వరన్ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లేలోపు అతను చనిపోయాడు… ఇది జరిగింది… అంటే శక్తీశ్వరన్ … బరువు తగ్గడానికి కేవలం జ్యూసులు మాత్రమే తీసుకున్నాడు… చాలా నెలల తర్వాత ఒక్కసారిగా ఘన ఆహారం తీసుకోవడంతో ఇబ్బంది పడ్డాడు. చివరకు చనిపోయాడు… అందరికీ ఇలా జరుగుతుందా అంటే చెప్పలేం…

యూట్యూబ్ డైట్ ప్లాన్లు ఎందుకు ప్రమాదకరం?
ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమకు తోచిన డైట్ ప్లాన్లను చెబుతున్నారు. కొందరు “జ్యూస్ డైట్”, “మొలకల డైట్” లాంటివి సూచిస్తారు. కానీ, ఈ డైట్‌లు చాలా వరకు సైంటిఫిక్ గా కరెక్ట్ కాదు… మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. ఒక్క జ్యూస్‌లు లేదా పచ్చి కూరగాయలు మాత్రమే తీసుకుంటే, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, మినరల్స్ లాంటివి అందవు..ఇది శరీరాన్ని వీక్ చేస్తాయి. రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి…శ్వాస సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శక్తిశ్వరన్ విషయంలో… ఘన ఆహారం లేకపోవడం వల్ల అతని శరీరం పోషకాహార లోపంతో బాధపడింది. అకస్మాత్తుగా ఆహారం తీసుకోవడం వల్ల అతని శరీరం దాన్ని తట్టుకోలేకపోయింది. ఇలాంటి డైట్‌లు సైంటిఫిక్ గా కరెక్ట్ కాకపోవడమే ఇందుకు కారణం.

ఇన్‌ఫ్లుయెన్సర్లను గుడ్డిగా నమ్మొద్దు
సోషల్ మీడియాలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు అర్హత లేకుండా డాక్టర్లలా హెల్త్ టిప్స్ ఇస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే డైట్ ప్లాన్లు ఆకర్షణీయంగా ఉంటాయి,
వాళ్ళు వీడియోలు, రీల్స్ లో డిస్ ప్లే చూపించినప్పుడు ఈజీగా అట్రాక్ట్ అవుతాం…
కానీ చాలా సార్లు అవి ఒకరి శరీరానికి సరిపోతాయని గ్యారంటీ లేదు. ఒకరికి సరిపడే డైట్ మరొకరికి ప్రమాదకరం కావచ్చు. అందుకే, ఏ డైట్ ప్లాన్‌ని ఫాలో అవ్వాలన్నా ముందు తప్పనిసరిగా డైటీషియన్ లేదా డాక్టర్‌ని సంప్రదించాలి.
బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
బరువు తగ్గడం అంటే కేవలం జ్యూస్ డైట్ లేదా ఒకే రకం ఆహారం తీసుకోవడం కాదు. నిపుణుల సలహా ప్రకారం, సమతుల్య ఆహారం, రోజూ వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ… మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి…ఇవన్నీ కలిస్తేనే ఆరోగ్యకరమైన బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
సమతుల్య ఆహారం: మీ శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సరైన మోతాదులో తీసుకోవాలి. ఉదాహరణకు, కూరగాయలు, పండ్లు, గింజలు, ధాన్యాలు కలిపిన ఆహారం ఆరోగ్యానికి మంచిది.
వ్యాయామం: రోజూ యోగా, వాకింగ్, జాగింగ్ లాంటి కార్యకలాపాలు చేయడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి, శరీరం ఫిట్‌గా ఉంటుంది.
డైటీషియన్ సలహా: మీ వయసు, శరీర బరువు, ఆరోగ్య పరిస్థితులకు తగ్గట్టు డైటీషియన్ ఇచ్చే ప్లాన్ ఫాలో చేయడం ఉత్తమం.
ఓపిక, జాగ్రత్త: ఒక్క రోజులో బరువు తగ్గాలని ఆశించకూడదు. శాస్త్రీయంగా, నెమ్మదిగా తగ్గడం శరీరానికి మంచిది.
డాక్టర్ సలహా ఎందుకు ముఖ్యం?
డైట్ ప్లాన్ మొదలుపెట్టే ముందు డాక్టర్ లేదా డైటీషియన్‌ని సంప్రదించడం చాలా కీలకం. వాళ్ళు మీ శరీర అవసరాలను అర్థం చేసుకుని, సరైన పోషకాహార ప్లాన్ సూచిస్తారు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి డయాబెటిస్ ఉంటే, అతనికి సరిపడే డైట్ వేరే వ్యక్తికి సరిపడకపోవచ్చు. అందుకే, డాక్టర్ల సలహా లేకుండా యూట్యూబ్ లేదా సోషల్ మీడియా డైట్‌లు ఫాలో చేయడం ప్రమాదకరం. తెలంగాణ వైద్య మండలి వైస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ సూచన ప్రకారం, అర్హతలేని వైద్యులు లేదా ఇన్‌ఫ్లుయెన్సర్లను నమ్మకూడదు. అలాంటి వాళ్లపై ఫిర్యాదు చేయాలంటే antiquackerytsmc@onlinetsmc.in కి మెయిల్ చేయవచ్చు. శక్తిశ్వరన్ మరణం మన అందరికీ కూడా ఓ హెచ్చరిక. ఆరోగ్యం అనేది జోక్ కాదు. గుడ్డిగా ఇన్‌ఫ్లుయెన్సర్లను నమ్మకుండా, శాస్త్రీయంగా, నిపుణుల సలహాలు ఫాలో అయితేనే… ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందగలం. జాగ్రత్త!
విజ్ఞప్తి…
మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి… ఓ రిక్వెస్ట్ చేస్తున్నా…
యోగ అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. మైండ్ పవర్, Law of Attraction, ఆహార నియమాలతో మన జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం. అనుకున్న పనులు, లక్ష్యాలను నెరవేర్చుకోవడం లాంటివి శ్రీ రఘు గురూజీ అద్భుతంగా చెబుతారు. జీవితంలో ఎన్నో గంటలు వేస్ట్ చేసాం. రోజుకి 2 గంటలు 10 రోజుల టైం కేటాయించండి. దానికి సంబంధించి వేరే వీడియో ఇస్తాను. ఎవరైనా సంకల్ప క్రియా యోగాలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ పాంప్లేట్ లో పెట్టిన నెంబర్ కు వాట్సాప్ మెస్సేజ్ చేయండి
థ్యాంక్యూ

Read also : టెన్షన్ పడొద్దు ! ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ !!🌟
BEST DIET PLAN BOOKS (SUGGESTED BY A DOCTOR ) : CLICK HERE FOR LINK

85 Ways to Loose Weight + Home Remediates : CLICK HERE FOR LINK




