మెరిల్‌విల్ లో తెలుగువాళ్ళ ఉగాది సందడి

Latest Posts NRI Times

Ugadi 2025: అమెరికాలోని చికాగో మహా నగరం దగ్గర్లోని మెరిల్‌విల్ నగరంలో 2025న విశ్వావసు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సెంటర్ (IACC) ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. వేడుకలకు 200 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పన్నా బరై, డాక్టర్ చందన వావిలాల, డాక్టర్ అంజనీ ప్రియ తల్లంరాజు, ఇందిర కేసాని, డాక్టర్ చిల్లరిగె అన్నాజీ తదితర ప్రముఖులు పాల్గొని దీపాన్ని వెలిగించారు.

Read this also : ఉగాది నాడు ఏం చేయాలంటే…!

swadeshmediausa.com

అతిథులను డాక్టర్ చిల్లరిగె అన్నాజీ సాదరంగా ఆహ్వానించారు. డాక్టర్ కిషోర్ కేసాని స్వాగత ప్రసంగంతో వేడుకలకు ఘనమైన ప్రారంభం ఇచ్చారు. సభా ప్రాంగణం పూలతో, రంగవల్లులతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణను అనిల్ వెలిగండ్ల ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు.

swadeshmediausa.com

వినోద కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని గుర్తుచేసింది. లావణ్య వెలిగండ్ల, సౌజన్య చాగి పర్యవేక్షణలో జరిగిన పాటలు, ఆటలు, నృత్యాలు అన్ని వయస్సుల వారిని ఆకట్టుకున్నాయి. ఆడపడుచుల నృత్య ప్రదర్శనలు విశేషంగా ప్రశంసలను అందుకున్నాయి.

swadeshmediausa.com

పిల్లల పాటల పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు పద్మిని మాకం ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అనేక మంది స్వచ్ఛంద సేవకులను డాక్టర్ వెంకట రమణ వావిలాల ప్రత్యేకంగా అభినందించారు.

swadeshmediausa.com

కార్యక్రమ నిర్వహణలో సాంకేతిక సహకారాన్ని అందించిన యుగంధర్ నగేష్, శ్రీలత ఎలమంచిలి దంపతులకు డాక్టర్ రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అతిథులకు బావర్చి అరోరా, ప్రవీణ్ వేములపల్లి రుచికరమైన విందు భోజనాలను అందించి వేడుకకు ప్రత్యేకమైన పండుగ వాతావరణాన్ని కల్పించారు.

ఈ విధంగా మెరిల్‌విల్ నగరంలో విశ్వావసు ఉగాది వేడుకలు సాంప్రదాయ బద్ధంగా, ఘనంగా నిర్వహించబడాయి.

swadeshmediausa.com

swadeshmediausa.com

Read this article : ‘విశ్వావసు’లో చేతిలో డబ్బులు ఉంటాయా ?

Read this also : ఉగాది పచ్చడి ఎలా చేయాలి ?

Read this also : ఈ ఏడాది డబ్బున్నోళ్ళు ఈ రాశుల వారే … !

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

 

Tagged

Leave a Reply