కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు,
పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు),
వేప పువ్వు -ఒక టేబుల్ స్పూన్,
పచ్చి మిర్చి – రెండు (తురమాలి),
ఉప్పు -చిటికెడు,
చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది).
ఎలా తయారీ చేయాలి ?
• బెల్లాన్ని తురమాలి. అందులో కొద్దిగా నీటిని చల్లి పక్కన పెట్టాలి. వేప పువ్వులో కాడలు తీసేసి…పువ్వు రెక్కలను సేకరించాలి.
• మామిడి కాయను నిలువుగా కోసి లోపలి టెంకను తీసేయాలి. ఇప్పుడు మామిడి కాయను తొక్కతోపాటు సన్నగా ముక్కలు తరగాలి. తురిమి బెల్లం నీటిలో వేయాలి.
• చింతపండు గుజ్జును చిక్కగా రసం తీసి ఈ మిశ్రమంలో కలపాలి. అందులో పచ్చి మిర్చి తురుము (కొద్దిగా మాత్రమే వేసుకోవాలి), ఉప్పు, వేప పూత వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా మారుతుంది. ఇందులో మరింత రుచి కోసం చెరకు ముక్కలు, మగ్గిన అరటి పండు గుజ్జు కూడా కొందరు కలుపుకుంటారు.
Read this article also : ఉగాది నాడు ఏం చేయాలంటే…!
Read this article : వందేళ్ళ తర్వాత సప్తగ్రాహి యోగం – అదృష్టం ఈ రాశులదే !
Read this also : ‘విశ్వావసు’లో చేతిలో డబ్బులు ఉంటాయా ?