Ugadi 2025 : కాలాన్ని లెక్కపెట్టడంలో రెండు ప్రధాన పద్ధతులున్నాయి. ఒకటి చాంద్రమానం (Chandramana Calendar), రెండోది సౌరమానం (Souramana Calendar). భారతీయులు ఈ రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చారు. అధికమాసాలు ద్వారా సమన్వయపరుస్తారు. చంద్రుని కళలను బట్టి తిథులు (Tithulu), నక్షత్రాలను బట్టి మాసాలు తెలుసుకోవచ్చు. ఈ తారల గమనం ఆధారంగానే ఉగాది వచ్చింది.
ఉగాది (Ugadi) అంటే నక్షత్రాల గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది లేదా సంవత్సరాది. యుగాది పదమే క్రమంగా ఉగాది (Ugadi Festival)గా మారింది. ఇది కృతయుగం (Krita Yuga) ప్రారంభమైన రోజు అంటారు.
Read this also : ఉగాది పచ్చడి ఎలా చేయాలి ?
కాలగమనాన్ని విశ్లేషించిన మహర్షులు
ఉగాదిని సృష్ట్యాదితో ముడిపెట్టి సిద్ధాంతాలను ప్రతిపాదించినవారు వరాహమిహిరుడు, హేమాద్రి పండితుడు, నిర్ణయసింధుకారుడు తదితరులు. భాస్కరాచార్యుడు (Bhaskaracharya) సిద్దాంత శిరోమణిలో ఉగాది పుట్టుకను వివరించాడు. ఆయన ప్రకారం, సూర్యుడు (Surya) చైత్ర శుద్ధ పాడ్యమిబమ నాడు లంకా నగరం నుంచి ఉదయించడం వల్ల అదే ఉగాది అని ప్రతిపాదించాడు.
ఉగాది నాడు చేయాల్సిన పూజా కృత్యాలు (Ugadi Pooja Vidhanam)
- తైలాభ్యంగనం (Tailabhyanjanam) – నువ్వుల నూనెతో స్నానం చేయడం.
- కొత్త బట్టలు కట్టుకోవడం (New Clothes) – శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం.
- సంకల్పం (Sankalpam) – కొత్త సంవత్సర నామాన్ని తలచడం.
- నింబపల్లవ భక్షణం (Neem Leaves Eating) – వేపచిగుళ్లు తినడం.
- ధ్వజారోహణం (Flag Hoisting) – ఇంటిపైన పతాకం ఎగరేయడం.
- పంచాంగ శ్రవణం (Panchanga Sravanam) – కొత్త సంవత్సరపు పంచాంగం వినడం.
ఉగాది పచ్చడి విశిష్టత (Ugadi Pachadi)
ఉగాది పచ్చడి (Ugadi Pachadi) అంటే ఆరు రుచుల మిశ్రమం, దీనిలో షడ్రుచులు ఉంటాయి:
- తీపి (Sweet) – బెల్లం (Jaggery)
- పులుపు (Sour) – చింతపండు (Tamirand)
- ఉప్పు (Salt) – ఉప్పు (Salt)
- కారం (Spicy) – మిరప పొడి (Chilli Powder)
- వగరు (Pungent) – పచ్చిమిరప (Chilli)
- చేదు (Bitter) – వేపపువ్వు (Neem Flower)
ఈ షడ్రుచుల సమ్మేళనం (Shadruchula Sammelanam) జీవితంలోని ఆనందం, దుఃఖం, అనుభవం, సంతోషం లాంటి భావాల సమ్మేళనానికి ప్రతీక.
ఆరోగ్య ప్రాధాన్యత
వసంత రుతువు ప్రత్యేకమైనది. ఈ కాలంలో మామిడి, మల్లెపూలు విరివిగా లభిస్తాయి. వసంతం ప్రకృతిని పునరుజ్జీవనం చేస్తుంది.
తైలాభ్యంగనం (Oil Bath) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నువ్వులనూనెలో లక్ష్మీదేవి, జలంలో గంగాదేవి ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.
ఉగాది పండగ (Ugadi Festival) మన సంప్రదాయాల రక్షణ, ఆధ్యాత్మికత, ఆరోగ్యం మరియు సంతోషం కోసం ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. పండుగ (Festival) సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలి.
Read this also : ‘విశ్వావసు’లో చేతిలో డబ్బులు ఉంటాయా ?
Read this also : ఏప్రిల్ లో పెళ్ళికి మంచి ముహూర్తాలివే!
Read this also : ఉగాది పచ్చడి ఎలా చేయాలి ?