ఒక్క రోజు టార్గెట్ రూ.100కోట్లు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ఈ నెల 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక విష్ణు అయితే ఈ సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. భారీ క్యాస్టింగ్, బిగ్ బడ్జెట్‌తో రూపొందిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ‘కన్నప్ప’ పై బిజినెస్ పరంగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో అక్కడ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సోమవారం నుంచి అమెరికాలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ‘కన్నప్ప’ ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదలవుతోంది. అందరూ ఎదురుచూస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా ఓపెనింగ్ డే రికార్డుల మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇండియాలో ఈ మూవీని 4,300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి ప్రీమియం-ఫార్మాట్ ఇక ఓవర్సీస్‌లో 1,100పైగా స్క్రీన్లు, 200లకు పైగా యూస్ ప్రీమియర్ లను ప్లాన్ చేశారు. మొత్తానికి ఈ సినిమా ఓపెనింగ్ డేకి రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. రూ.100 కోట్లతో డే వన్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉందని తెలుస్తోంది. కన్నప్పలో ప్రభాస్ తో పాటు మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్స్ నటించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also read: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో చాబహార్ పోర్ట్ పై ఎఫెక్ట్
Also read: కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ సీటుపై లొల్లి
Also read: చారాణా కోడికి బారాణా మసాలా అంటే ఇదే !
Also read: https://in.bookmyshow.com/movies/hyderabad/kannappa/ET00377025