కవిత ఇంటికి వాస్తు దోషం వల్లే సమస్యలు

Latest Posts Trending Now

* నందినగర్ ఇంట్లో మార్పులు చేయిస్తున్న కవిత
* జాగృతి ఆఫీసులోనూ వాస్తు మార్పులు
* శ్రావణ మాసంలోగా పనులు పూర్తికి ఆదేశం
* వాస్తు మారితే మంచి రోజులు వస్తాయన్న సిద్ధాంతి

కవిత ఇంటికి వాస్తు దోషం
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవితపై ప్రతి రోజూ చర్చ జరుగుతోంది. డాడీకి రాసిన లెటర్ లీక్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక ఇష్యూలో ఆమె కాంట్రోవర్సీగా మారుతున్నారు. వీటిన్నింటికీ కారణం… ఇంట్లో వాస్తు దోషాలే అని నమ్ముతున్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకే ఇంట్లో వాస్తు మార్పులు చేయిస్తున్నారట. గతంలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ గాంధీనగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. 2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో కూడా ఆమెకు సొంత ఇల్లు లేదు. అప్పట్లో నిజామాబాద్ పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో సొంత ఇల్లు కట్టించుకున్నారు. కానీ, ఆ ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి ఆమెకు ఏదీ సరిగ్గా కలిసి రాలేదని టాక్ నడుస్తోంది. కవిత రెండేళ్ల పాటు చాలా ఇష్టంగా ఆ ఇల్లు కట్టించి, గృహప్రవేశం చేశారు. కానీ, అప్పటి నుంచి ఆమెకు సమస్యలు మొదలయ్యాయని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఆ ఇంట్లోకి వచ్చాకే.

ఈడీ, సీబీఐ కేసులతో కవిత ఇబ్బంది పడ్డారు. నందినగర్‌లోని ఆ ఇంట్లో ఉండగానే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత దాదాపు ఆరు నెలలు జైలులో గడిపారు. జైలు నుంచి వచ్చాక కూడా పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు సరైన స్థానం దక్కలేదు. దీంతో నిరాశతో ఉన్న కవిత, తన తండ్రికి లెటర్ రాశారు. అంతేకాదు, పార్టీని, కేటీఆర్‌ని, హరీష్ రావుని పరోక్షంగా విమర్శిస్తూ వస్తున్నారు. అయినా, బీఆర్ఎస్ నాయకులు దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. అందుకే కవిత ఒక సిద్ధాంతి సలహాతో వాస్తు మార్పులు చేయించేందుకు సిద్ధమయ్యారు. నెల రోజుల క్రితం తన ఇంటి పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీసు ప్రారంభించారు. ఆ ఆఫీసులో కూడా వాస్తు మార్పులు చేశారు. ఇంటి ముందు గోడను తొలగించారు. జాగృతి ఆఫీస్ ఎంట్రెన్స్‌ను కూడా పక్కకు మార్చారు.

ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంటి ప్రధాన ద్వారం, వాయువ్య మూలలో ఉంది. దాన్ని ఇంటి మధ్యలోకి మార్చుతున్నారు. సింహద్వారానికి ఎదురుగా ఈ డోర్ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, ఇంటి నుంచి జాగృతి ఆఫీసుకు వెళ్లడానికి ప్రత్యేక డోర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆషాఢమాసం పూర్తయి, శ్రావణమాసం రాకముందే ఈ వాస్తు మార్పులన్నీ పూర్తి చేయాలని కవిత ఆదేశించారు. ఇప్పుడు తనకు మంచి జరగడం లేదని, కానీ త్వరలో మంచి రోజులు వస్తాయని ఆమె నమ్ముతున్నారు. ఇంటి వాస్తు సరిగా లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయని కవిత అనుచరులు కూడా అనుకుంటున్నారు. నిజంగా వాస్తు దోషమే కవితకు ఈ చెడు రోజులు తెచ్చిందా? ఈ కొత్త మార్పులతో ఆమె మళ్లీ ట్రాక్‌లోకి వస్తారా? చూద్దాం, శ్రావణ మాసంలో ఏం జరుగుతుందో!

READ ALSO  పితృ తర్పణాలకు జ్యేష్ఠ అమావాస్య

Also read: రష్మికపై మరోసారి కన్నడిగుల ఫైర్

Also read: నా పెళ్లెప్పుడో మీకెందుకు..?

Also read: ఇక ఆ వీడియోలకు డబ్బులు రావు

Also read: https://telugu.oneindia.com/videos/telangana-jagruti-president-and-mlc-kavitha-is-making-changes-in-her-house-4252892.html

Tagged