ACలు వాడుతున్నారా ? బ్లాస్ట్ అవ్వకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి !

Latest Posts Trending Now

ఇండియాలో ఎండలు మండిపోతున్నాయి.  చాలా మంది ఇంటి తలుపులు మూసి, ఏసీ ముందు కూర్చోవడం కామన్ అయింది.  అయితే ఇదే సమయంలో మీ కరెంట్ బిల్లు కూడా భారీగా పెరిగే అవకాశముంది. ఇంకా ప్రమాదకరంగా చెప్పాలంటే, ఏసీని అధికంగా వాడటం వల్ల “AC బ్లాస్ట్”లాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశముంది.  ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. అందుకే ఈ వేసవిలో మీ ఇంటిని చల్లగా ఉంచేందుకు, మీ జేబుకు చిల్లులు పడకుండా ఉండేందుకు ఓ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ (Heatwave action plan ) ఇది…

Air conditioner


🌬️ 1. ఏసీ(AC) కి కూసంత ప్రేమ, కేర్ అవసరం! 

ఏసీకి మనసు ఉండకపోయినా, సరైన కేర్ లేకపోతే అది మానసికంగా కాదు, ఫిజికల్‌గా క్రాష్ అయిపోతుంది! వేసవికి ముందు తప్పనిసరిగా సర్వీస్ చేయించండి. డస్ట్‌తో ఫిల్టర్లు మూసుకుపోతే కోయిల్స్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు, ఒకే సాకెట్‌కి ఫ్రిడ్జ్, మైక్రోవేవ్‌తో పాటు ఏసీ కనెక్ట్ చేయకండి. ఎప్పుడూ ప్రత్యేక పవర్ పాయింట్‌ని మాత్రమే ఉపయోగించండి.


🌡️ 2. 24 డిగ్రీలే బెస్ట్ టెంపరేచర్!

18 డిగ్రీలో AC పెడితే  మనం షిమ్లాలో ఉన్నామన్న ఫీలింగ్ రావచ్చు కానీ, మీ బిల్లు మాత్రం మంటలు పెడుతుంది! Bureau of Energy Efficiency ప్రకారం, 24 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అత్యుత్తమమైనది. 24 కన్నా తక్కువ చేసిన ప్రతి డిగ్రీకి, విద్యుత్ వినియోగం 6 శాతం పెరుగుతుంది. కంఫర్ట్, సేవింగ్ రెండు కలగలిపే టెంపరేచర్ ఇది.


🌀 3. Fan + AC = పవర్ సేవింగ్ జోడీ!

ఏసీ ఉన్నప్పుడు ఫ్యాన్ ఎందుకు? అనే ఆలోచన తప్పు. ఫ్యాన్ వాడటం వల్ల చల్లటి గాలి అంతటా సమానంగా విస్తరిస్తుంది. ఇది uneven కూలింగ్‌ను తగ్గిస్తుంది, ACపై ఒత్తిడి తగ్గుతుంది.


ACs

🌞 4. కర్టెన్లు వేశారు కదా?

సూర్యకాంతి ఫోటోలకి బావుంటుంది కానీ AC రూములకి కాదు! రోజూ మధ్యాహ్నం కర్టెన్లు వేసి ఉంచండి. ఇంకా బెటర్ — విండోస్‌కి రిఫ్లెక్టివ్ ఫిలిమ్స్ వాడండి. కూల్ ఎయిర్ బయటకు పోకుండా తలుపులు, కిటికీలను బాగా మూసివేయండి. ఇలా చేస్తే AC పని తగ్గుతుంది, మీ బిల్లు కూడా తగ్గుతుంది.


⭐ 5. ఫైవ్ స్టార్ ACలే జీనియస్!

ఇంకా 2010లో కొన్న AC వాడుతున్నారా? అవి కరెంట్ బిల్లు మోత మోగించే డేంజర్ బాంబులు..! ఇప్పుడు మార్కెట్లో ఉన్న 5-స్టార్ ACలు 50% తక్కువ పవర్ ఖర్చు చేస్తాయి. మీ బడ్జెట్‌ను బట్టి కనీసం 4-స్టార్ ACకి అప్‌గ్రేడ్ అవ్వండి. ఎక్కువ స్టార్ = తక్కువ విద్యుత్ బిల్లు అని గుర్తుంచుకోండి


💤 6. టైమర్ & స్లీప్ మోడ్ మీకు భరోసా!

రూమ్‌లో లేని సమయాల్లో కూడా ఏసీ నడుస్తుందా? అలాంటి అలవాట్లను వెంటనే మార్చేయండి. స్లీప్ టైమ్‌లో “స్లీప్ మోడ్” వాడండి. ఇది కొద్దిగా గరిష్ఠంగా టెంపరేచర్ పెంచుతూ, చల్లదనాన్ని నిలుపుతుంది. 6–8 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా టైమర్ పెట్టుకోండి.


✅ ఫైనల్ గా…

ఈ వేసవిని AC మిత్రుడిని డేంజర్‌గా మార్చకుండా జాగ్రత్తగా వాడండి. చిన్న చిన్న చిట్కాలతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు, పెద్ద బిల్లులను తగ్గించవచ్చు. మీ ఆరోగ్యం, మీ జేబు — రెండూ బాగుండాలంటే ఈ 6 పాయింట్లను పాటించండి!


నోటీసు: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఎలక్ట్రికల్ సమస్యలు లేదా హోం అప్లయన్స్ రిపేర్స్ కోసం ఎప్పుడూ నిపుణులను సంప్రదించండి.

ఇది కూడా చదవండి : ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..!

ఇది కూడా చదవండి : ఎండలో కారు నడుపుతున్నారా? Be Careful!

Join our Telegram Channel : CLICK HERE

Join our What’s app Group : CLICK HERE

Tagged