AC purchase : చలికాలం ఇంకా పూర్తిగా పోకముందే… శివరాత్రి కంటే ముందే ఎండలు ప్రతాపం చూపించడం మొదలు పెట్టాయి. గత ఏడాది 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డు అయితే… ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అందుకే చాలా మంది ఈసారి ఏసీలు కొనాలని చూస్తున్నారు. ఏసీలు కొనడానికి ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
డబ్బులు ఉన్నవాళ్ళే ఏసీలు కొనుక్కుంటారని గతంలో అనుకునే రోజులు పోయాయి. ఎండలు మండిపోతుండటంతో ఫ్యాన్ కింద బతకడం కష్టమవుతోంది. అందుకే చాలామంది కూలర్లు, ఏసీల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Read this also : శివయ్యను ఇలా ఆరాధిస్తే కష్టాలు తొలగుతాయి !
ఏసీలు కొనేముందు !
మీరు సరైన ఏసీ కొనకపోతే కరెంట్ బిల్లు వాచిపోయే అవకాశముంది. అందుకే ఏసీ కొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు ఏ గదిలో ఏసీ (Air Conditioners)ని పెట్టుకోవాలని అనుకుంటున్నారు అన్నది ముందు డిసైడ్ చేసుకోవాలి. పిల్లల గది, మాస్టర్ బెడ్‌రూం, లివింగ్ రూం.. ఇలా మీరు వాడే ప్రదేశాన్ని బట్టి ఏసీ రకాన్ని కూడా ఎంపిక చేసుకోవాలి. 120 చదరపు అడుగుల కంటే తక్కువ సైజ్ ఉండే చిన్న రూం అయితే ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది. అయితే 120-200 చ.అడుగులకు 1-2 టన్నులు, లివింగ్ రూం… అంటే 200 చదరపు అడుగుల కంటే పెద్ద గదులకు రెండు టన్నులు…. లేదా ఇంకా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలను పెట్టుకోవాలి
ఏసీలో ఎన్నో రకాలు !
Window AC : సింగిల్ రూమ్ కోసం ఇలాంటి విండో ఏసీని వాడతారు. కిటికీ లేదంటే గోడ ఖాళీగా ఉండే చోట దీన్ని అమర్చవచ్చు. కానీ సౌండ్ ఎక్కువగా వస్తుంది. ధర తక్కువ.
Split AC : ఇందులో రెండు equipments విడివిడిగా ఉంటాయి. ఒక దాన్ని ఇంట్లో బిగిస్తే మరోదాన్ని బయట అమర్చాలి. కంప్రెసర్ బయట ఉంటుంది. దీంతో శబ్దం పెద్దగా ఉండదు.
Hot & Cold AC: అన్ని వాతావరణ పరిస్థితులకు ఈ AC సరిపోతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు గదిని కూల్ చేస్తుంది. అలాగే శీతాకాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది.
పోర్టబుల్ ఏసీ: అవసరానికి అనుగుణంగా ఏ గదికి కావాలంటే అక్కడికి ఎలాంటి శ్రమ లేకుండా దీన్ని షిప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
టవర్ ఏసీ: పెద్ద గదులు లేదా కమర్షియల్ ప్లేస్‌లను వేగంగా కూల్ చేసేందుకు టవర్ ఏసీలు వాడుతుంటారు.
ఏసీ కొనేముందు ఇవి చూడాలి
స్టార్ రేటింగ్
అన్ని ఏసీల సామర్థ్యం ఒకేలాగా ఉండదు. కరెంట్ను వాడుకునే విషయంలో తేడాలుంటాయి. స్టార్ రేటింగ్ ఆధారంగా దీన్ని సూచిస్తారు. ఒక స్టార్ ఉన్న ఏసీలు అస్సలు కొనొద్దు. కరెంట్ బిల్లు తడిసి మోపెడు అవుతుంది. 4, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలతో కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. రేటింగ్ పెరిగే కొద్దీ power consumption తగ్గుతుంది.
Invertor AC
ఇన్వర్టర్ ఏసీలో గది చల్లదనాన్ని బట్టి కంప్రెసర్ పనిచేస్తుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు కంప్రెసర్ అధికంగా పనిచేస్తుంది. రూమ్ కూల్‌గా ఉంటే దానిపై లోడ్ తక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే power consumption ఉంటుంది. Invertor AC లతో కరంట్ బిల్లు తక్కువగా వస్తాయి. ఏసీ కొనేవారు వీటికి ప్రియారిటీ ఇవ్వడం బెటర్.
ఇంకా ఏం చూడాలంటే…
☑️ ఎయిర్ ఫిల్టర్లు ఉంటే ఎలాంటి దుమ్ము చేరదు. దాంతో అలర్జీల లాంటివి రావు.
☑️ ఆటో క్లీన్ ఫీచర్ వల్ల ఏసీ దానికదే శుభ్రం చేసుకుంటుంది. అప్పుడు బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు చేరకుండా ఉంటాయి.
☑️ గది తేమ, తడితో నిండకుండా ACలో dehumidification feature ఉండాలి.
☑️ ACకి Smart connectivity, After Sales Service, Auto Start, ఫోర్-వే స్వింగ్, టర్బో మోడ్, స్లీప్ అలార్మ్ లాంటి ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
☑️ అల్యూమినియం కాయిల్స్ ఉన్నవాటికన్నా కాపర్ కాయిల్స్ ఉన్న ఏసీలను కొనుక్కోవడం బెటర్. ఇవి ఎక్కువ కూలింగ్ ఇస్తాయి. కాపర్ కాయిల్ ఏసీలు నిర్వహణ కూడా ఈజీ. ఎక్కువ కాలం పనిచేస్తాయి.
Advanced AC features
ఈమధ్య wifi enabled ACలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ రేటు ఎక్కువగా ఉంటాయి. తక్కువ బడ్జెట్లో ఏసీ కొనాలి అనుకుంటే ఇవి అక్కర్లేదు.
Amazon Affiliated
మంచి AC కొనాలనుకుంటున్నారా !
ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. తక్కువ ధరలో దొరుకుతోంది.
CLICK HERE FOR AMAZON LINK
EMI ఆప్షన్ కూడా ఉంది
LG కంపెనీలో బెస్ట్ ఏసీ. 5 స్టార్ రేటింగ్ కలిగిన ఇన్వెర్టర్ మోడల్ Split AC, Fast Cooling & Energy Saving
(LG 1.5 Ton 5 Star DUAL Inverter Split AC (Copper, AI Convertible 6-in-1, VIRAAT Mode, Faster Cooling & Energy Saving, 4 Way Swing, HD Filter with Anti-Virus Protection, 2025 Model, US-Q19YNZE, White)
ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. తక్కువ ధరలో దొరుకుతోంది.
CLICK HERE FOR AMAZON LINK
Read this also : వామ్మో ఆ కూరలు తింటున్నారా ?
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.
Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK