Mahashivratri 2025 : శివ అంటే మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలు ఉన్నాయి. మనమంతా కోరుకునేవి ఇవే. ఇవి దక్కాలంటే శివయ్య ఆశీస్సులు కలగాలంటే… మహా శివరాత్రి అనుకూలమైన రోజు. చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ మాసంలో బహుళ చతుర్ధశిని మహాశివరాత్రి పండగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) మహా శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ రోజు శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు భక్తులు. ఈ రోజున రాత్రంతా మేలకువతో జాగరణ చేసి శివ పూజలు, భజనలతో గడుపుతారు.
ఇది కూడా చదవండి :గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు కలసి ఉంటాయి ?
శివరాత్రికి ఎందుకు ప్రత్యేకత ?
మాఘ బహుళ పక్ష చతుర్ధశి అర్థరాత్రి లింగోద్భవ కాలం. పరమాత్మను నిశిరాత్రిలో పూజించే ప్రత్యేక పర్వదినం. ఈ మహాశివరాత్రి రోజునే శివుడు అగ్ని లింగ రూపంలో ఆవిర్భవించినట్టు మన పురాణాల్లో ఉంది. రాత్రి పూట లౌకిక వ్యవహారాలు సద్దుమణిగి ఉంటాయి. మన ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల చుట్టూ పరిభ్రమించే మనసును, చైతన్యానికి మూల కేంద్రమైన ఆత్మజ్యోతిలో అంటే శివజ్యోతిలో లీనం చేసే ప్రయాణమే శివరాత్రి. అలజడులన్నీ తగ్గిపోయి ధ్యానానికి అనుకూలమైన సమయం ఇది. మహా శివరాత్రి నాడు పగలంతా ఉపవాసాలు ఉండి, రాత్రిళ్ళు అభిషేకాలు, పూజలు, జాగరణ చేయాలని లింగపురాణం చెబుతోంది. రోజు మొత్తం శివ నామస్మరణలో ఉండటం వల్ల మనసు పరిశుద్ధం అవుతుందని భక్తులు నమ్ముతారు.
శివరాత్రి నాడు ఇలా చేయండి
మహా శివరాత్రి రోజు పెరుగులో తేనె కలిపి శివ లింగానికి అభిషేకం చేయాలని పెద్దలు చెబుతున్నారు. శివుడి అభిషేక ప్రియుడు. అందుకే ఇలా పెరుగులో తేనె కలిపి అభిషేకం చేయడం వల్ల ఆయన సంతోషిస్తాడు. ఇలా చేసిన వారికి శివయ్య ఆశీస్సులతో… సగంలో ఆగిన మీ పనులు తిరిగి పూర్తి అవుతాయనీ, మీరు కష్టాల నుంచి గట్టెక్కుతారని పండితులు చెబుతున్నారు. శ్రీరామచంద్రుడు కూడా కూడా సీతాదేవిని వెతికేటప్పుడు… సైకత లింగానికి అడవిలో లభించే తేనె…పెరుగు కలిపి అభిషేకం చేశారని రామాయణం చెబుతోంది. ఆ తర్వాతే హనుమాన్ కనిపించడం, సుగ్రీవుడితో స్నేహం లాంటి శుభ శకునాలు కలిగాయి.
మీ ఆర్థిక సమస్యలు తీరాలంటే !
🙏 ఆ పార్వతీ పరమేశ్వరులను పూజించడానికి బిల్వపత్రం చాలా అవసరం. శివరాత్రి రోజు బిల్వ పత్రం, పూలు, పండ్లు, పాలు, చందనం భగవంతుడికి సమర్పించాలి. ఇలా చేస్తే పూజ చేసే భక్తులపై శివుడి అనుగ్రహం కలిగి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
🙏 శివరాత్రి నాడు ఓం నమః శివాయ .. అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది.
🙏 శివుడు నిరాడంబరుడు… ఇతరులకు సేవ చేస్తే సంతోషిస్తాడు. తొందరగా అనుగ్రహిస్తాడు కూడా. అందుకే శివరాత్రి నాడు నిరుపేదలు, సాయం కోసం ఎదురు చూసేవారికి పాలు, పండ్లు, పప్పు ధాన్యాలు, బియ్యం లాంటి నిత్యావసరాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని కూడా శివయ్య ఆదుకుంటాడు.
🙏 శివరాత్రి నాడు పరమ శివుడికి చెంబుడు నీళ్ళు పోసినా….. భోళా శంకరుడు సంతోషిస్తాడు. జీవితంలో ఎలాంటి సమస్యను అయినా తొలగిస్తాడని చెబుతున్నారు.
🙏 శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కూడా పార్వతీమాత అంసే కదా..!
🙏 మహా శివరాత్రి నాడు హనుమాన్ చాలీసా చదివితే శివుడితో పాటు ఆంజనేయుడి అనుగ్రహం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
🙏 శివరాత్రి రోజున ఉపవాసం ఉండి భక్తితో శివయ్యకు నిత్య పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. ఆ రోజంతా ఆహారం ముట్టకుండా కేవలం ఫలాలు మాత్రమే తీసుకుని ఉపవాసాలు చేసి.. రాత్రి మొత్తం జాగరణ చేయాలని పెద్దలు చెబుతున్నారు.
🙏 సాలె పురుగు, పాము, ఏనుగు లాంటి మూగ జీవులను కూడా కరుణించి కైవల్యం ప్రసాదించిన దేవాది దేవుడు శ్రీ పరమేశ్వరుడు. భక్తుల పాపాలను రూపుమాపే శివుడు… లోకమంతా ఉన్నాడు. అసలు లోకమే ఆయనలో ఉంది.
మాతాచ పార్వతీ దేవి… పితా దేవో మహేశ్వరహ:
ఇది కూడా చదవండి : శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి ?
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.
Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK