చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో పల్లె సంబరాలు, రిపబ్లిక్ డే వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో చికాగో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా ఆహ్వానితులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న బొమ్మల కొలువు
శైలజా సప్ప ఆధ్వర్యంలో ఏర్పాటైన బొమ్మల కొలువు అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో పల్లెల్లో రోజువారీ జీవితాన్ని గుర్తు చేస్తూ బొమ్మలను ఏర్పాటు చేశారు. తమ చిన్నప్పట్టి పల్లె వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. ముద్దులొలికే చిన్నారు నాట్యాలు, ఆడపడుచుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. పిల్లలు పాడిన భక్తి గీతాలతో ఉద్వేగ భరిత వాతావరణం ఏర్పడింది.
2025 సంవత్సరానికి చికాగో ఆంధ్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణ మతుకుమల్లి, ఛైర్మన్ శ్రీనివాస్ పెద్దమల్లు, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ కౌన్సిల్ జనరల్ టీ.డి బూటియా పాల్గొన్నారు. చికాగో ఆంధ్ర సంఘం చేపట్టిన కార్యక్రమాలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అభినందించారు.
విందు భలే పసందు
మురళీ రెడ్డి పర్యవేక్షణలో బావర్చి బిర్యానీ-బౌలింగ్ బ్రూక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తెలుగు సంప్రదాయ వంటలను వడ్డించారు. త్రివర్ణ పతాకం రంగుల్లో వంటలను ప్రత్యేకంగా తయారు చేశారు.
Read this also : చియా సీడ్స్ తో బరువుకు చెక్ !
MORE PHOTOS
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న Telugu Word Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.