అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీపై (Goutam Adani) అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేయడంతో పాటు… అక్కడి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని US Securities & Exchange commission (SEC) ఆరోపించింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్ తో కలసి అదానీ గ్రీన్ ఎనర్జీ, SECIతో 12 GW సౌరవిద్యుత్ ఒప్పందాలు పొందాయని అభియోగపత్రంలో ఉంది. అందుకోసం ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు చేశారు US ప్రాసిక్యూషన్ అధికారులు. సంబంధిత కంపెనీలు అమెరికాలో పనిచేస్తున్నప్పుడు వారిపై లంచం ఆరోపణలు రావడంతో… వాటిపై అభియోగాలు వేసేందుకు అమెరికా చట్టాలు అనుమతిస్తాయి. భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే… అమెరికా చట్టాల ప్రకారం ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది అన్న చర్చ నడుస్తోంది.
అదానీ అప్పగింత కోరే ఛాన్స్ !
గౌతమ్ అదానీని అప్పగించాలని అమెరికా ప్రాసిక్యూటర్లు భారత ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. అయితే మన కోర్టులు భారతీయ చట్టం ప్రకారం ఈ అభియోగాలు వర్తిస్తాయో లేదో పరిశీలించే ఛాన్సుంది. తనపై వచ్చిన అభియోగాలను గౌతమ్ అదానీ అమెరికా కోర్టుల్లో సవాలు చేసుకుంటారు. అదానీ గ్రూప్ (Adani group) ఇప్పటికే ఈ విషయం ప్రకటించింది కూడా. దాంతో ఈ కేసు తేలేదాకా… అదానీ అప్పగింతను ఇప్పటికిప్పుడు కోరే అవకాశం అయితే లేదని అంటున్నారు.
Read this also : Adani case: అదానీ అరెస్ట్ అవుతారా ? ఘోరంగా పడిపోతున్న స్టాక్స్ !!
నేరం రుజువైతే 25 ఏళ్ళు జైలు
అదానీపై అమెరికాలో విచారణకు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశముంది. సాక్ష్యాధారాలు సమర్పించడం, అదానీ తో పాటు ప్రతివాదులపై ప్రత్యేక విచారణ, చట్టపరమైన చర్యలు, విచారణ… లాంటివి ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికాలో అద్వానీ చేసిన నేరం రుజువైతే లంచం ఇచ్చినందుకు ఐదేళ్లు.. మోసం, కుట్ర అభియోగాల కింద 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. భారీగా జరిమానాలు కూడా వేసే ఛాన్సుంది. ఫైనల్ గా శిక్షా కాలం, జరిమానాలు ఎంత విధిస్తారు అన్నది ప్రిసైడింగ్ జడ్జి నిర్ణయిస్తారు. ఏ శిక్ష విధించినా అదానీ లీగల్ టీమ్అప్పీల్ చేసుకోవచ్చు. ఈ న్యాయ పోరాటం మాత్రం చాలా కాలం పాటు కొనసాగే అవకాశముంది.
అదానీపై కుట్ర ఉందా ?
అదానీ గ్రూప్‌పై అమెరికాలోని జో బైడెన్ (Joe byden) ప్రభుత్వం ఏమైనా కుట్ర చేసిందా అన్న కోణంలో చర్చలు సాగుతున్నాయి. ఈమధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) ఓ దుండగుడు కాల్పులు జరిపినప్పుడు… అదానీ.. ట్రంప్‌కి మద్దతు పలికారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్‌నకు అదానీ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అమెరికాలో ప్రస్తుతం డెమోక్రాట్లకు మద్దతుగా చైనా కంపెనీలే సోలార్ పవర్ లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. అమెరికాలోని ఇన్ ఫ్రా అండ్ ఎనర్జీ (Infra & energy) ప్రాజెక్టులో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు చైనా కంపెనీలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రపంచంలో ఎక్కడ ఎనర్జీ కంపెనీలు పెట్టాలన్నా అదానీ గ్రూపులకు చైనా సంస్థలు అడ్డుగా నిలుస్తున్నాయి. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. గతంలో హండెన్ బర్గ్ రిపోర్టు లాగే భారతీయ పారిశ్రామికవేత్తల పరువు తీయడానికి చైనా కంపెనీలు మాగ్జిమమ్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
చక్రం తిప్పుతున్న సొరెస్
ప్రస్తుతం అదానీపై అభియోగాలు మోపిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పేస్ కు డెమెక్రాట్ నేతలు రిలేషన్స్ ఉన్నాయి. 2021లో ఇతన నియామకం మీద వివాదం చెలరేగింది. దాంతో డెమోక్రాట్ సెనేటర్ చక్ షుమర్ అండగా నిలిచినట్టు తెలుస్తోంది. ఈ షుమర్ కీ డీప్ స్టేట్ నిర్వాహకుడైన బిలియనీర్ జార్జ్ సొరెస్ తో సంబంధాలు ఉన్నాయి. సొరెస్ ఎప్పటి నుంచో భారత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం విదేశీ స్వచ్ఛంధ సంస్థల (NGOలు) కార్యకలాపాలపై ఆంక్షలు విధించడంతో సొరెస్ అడ్డగోలు పనులేవీ భారత్ లో నెరవేరడం లేదు. అందుకే అప్పుడు హిండెన్ బర్గ్ రూపంలో ఇప్పుడు సోలార్ పవర్ కేసులోనూ పరోక్షంగా సొరెస్ ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. సరిగ్గా భారత్ లో పార్లమెంట్ సమావేశాలకు ముందు ఈ కేసును తీసుకురావడం ద్వారా మోడీని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతోందని కొందరు బీజేపీ సీనియర్ నేతలు, ఫారెన్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ప్రధాని మోడీతో పాటు అదానీ కూడా ట్రంప్ కు శుభాకాంక్షలు చెప్పడం కూడా ఈ కుట్ర వెనక కారణమన్న ఊహాగానాలు వస్తున్నాయి.