ఏఐని మించిపోతున్న ఏజీఐ
నీ మనసు నాకు తెలుసు… అంటూ ఒక కొత్త సూపర్ హీరో లాంటి టెక్నాలజీ మన ముందుకు వస్తోంది. దాని పేరే ఏజీఐ – ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్! ఇది మనలాగే ఆలోచిస్తుంది, మన ఫీలింగ్స్ అర్థం చేసుకుంటుంది, సలహాలు ఇస్తుంది… ఒక్కమాటలో చెప్పాలంటే, మనిషి కాని మనిషిలా పనిచేస్తుంది!
ఏజీఐ అంటే ఏంటి?
ఏజీఐ అంటే కేవలం ఒక మెషిన్ కాదు… ఇది మన బ్రెయిన్‌లా ఆలోచించే సూపర్ ఇంటెలిజెన్స్! ఉదాహరణకు, నీవు ఒక వీడియోలో హ్యాపీగా ఉన్నావా, సీరియస్‌గా ఉన్నావా, లేదా బాధపడుతున్నావా అని గుర్తించి, నీతో అలాగే మాట్లాడగలదు. ఇది నీ అవసరాలను, అలవాట్లను అర్థం చేసుకుని, స్నేహితుడిలా సలహాలు ఇస్తుంది. గత అనుభవాల నుంచి నేర్చుకుని, తనను తాను మెరుగుపరచుకుంటుంది. ఒక్కమాటలో, ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే రోబో కంటే ఒక అడుగు ముందు!
ఏఐ vs ఏజీఐ – తేడా ఏంటి?
ఏఐ ఉంది కదా, మళ్ళీ ఏజీఐ ఎందుకు అని అనుమానం రావొచ్చు. ఏఐ అంటే ఒక పని కోసం డిజైన్ చేసిన టెక్నాలజీ. ఉదాహరణకు, సిరి, అలెక్సా లాంటివి నీవు అడిగిన ప్రశ్నలకు డాటా బేస్‌లో ఉన్న సమాధానం ఇస్తాయి. కానీ, నీ మాటల్లోని ఎమోషన్, వ్యంగ్యం, లేదా ముఖంలోని ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోలేవు. కానీ, ఏజీఐ? అది పూర్తిగా మనిషిలా ఆలోచిస్తుంది! రోబో సినిమాలో చిట్టి గుర్తుందా? భావోద్వేగాలు లేనప్పుడు అది ఏఐ… ఎమోషన్స్ వచ్చాక అది ఏజీఐ! ఏజీఐ నీ అవసరాలను అంచనా వేస్తుంది, నీకు సలహాలు ఇస్తుంది, నీతో ఒక బెస్ట్ ఫ్రెండ్‌లా చాట్ చేస్తుంది!
ఏజీఐ ఉపయోగం ఎక్కడ ?
ఏజీఐ రాగానే, మన లైఫ్ మారిపోతుంది!
వైద్యం: నీ ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకుని, వైద్యులకు సలహాలు ఇస్తుంది. మానసిక ఆరోగ్యం గురించి కూడా సపోర్ట్ చేస్తుంది
విద్య: నీ లెర్నింగ్ స్టైల్‌కు తగ్గట్టు పాఠాలు చెప్పగలదు. ఒక టీచర్‌లా నీకు గైడ్ చేస్తుంది
డైలీ లైఫ్ : నీ రోజువారీ పనులను ప్లాన్ చేయడం, షాపింగ్ లిస్ట్ రాయడం, లేదా నీ మూడ్‌కి తగ్గట్టు ఒక్క సాంగ్ సజెస్ట్ చేయడం… ఇవన్నీ ఏజీఐ చేయగలదు!
వ్యాపారం: కస్టమర్‌ల అవసరాలను అర్థం చేసుకుని, సూపర్ ఫాస్ట్‌గా సొల్యూషన్స్ ఇస్తుంది. మార్కెట్ ట్రెండ్స్ అంచనా వేస్తుంది
ప్రస్తుతం ఏజీఐ ఎక్కడుంది?
ప్రపంచంలో ఏజీఐ ఇంకా పూర్తిగా రాలేదు, కానీ దాని కోసం పోటీ మాత్రం జోరుగా ఉంది!
Meta AI: మార్క్ జుకర్ బర్గ్ 50 మంది టాప్ సైంటిస్టులతో ఏజీఐ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ ప్రకారం, భారీ ప్యాకేజీలతో ఈ ప్రాజెక్ట్‌ను స్పీడప్ చేస్తున్నారు.
OpenAI: GPT-4, ChatGPT లాంటి మోడల్స్‌తో ఏజీఐ దిశగా అడుగులు వేస్తోంది.
Google: DeepMind, Google Assistantలను మరింత అడ్వాన్స్‌డ్‌గా తీసుకొస్తోంది.
xAI: గ్రాక్ లాంటి టూల్స్‌తో మానవ ఆలోచనలను అర్థం చేసే టెక్నాలజీపై ఫోకస్ చేస్తోంది.
ఏజీఐతో రిస్క్‌లు ఉన్నాయా?
ఏజీఐ సూపర్ ఎక్సైటింగ్ అయినా, కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయ. నిపుణుల ప్రకారం, ఏజీఐని సరిగ్గా నియంత్రించాలి లేదంటే, అది మనిషి కంటే ఎక్కువ ఇంటెలిజెంట్ అయిపోయి, అనుకోకుండా సమస్యలు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఉదాహరణకు, టెర్మినేటర్ సినిమాలో రోబోలు మనుషులపై తిరిగినట్లు! అందుకే, ఏజీఐని డెవలప్ చేస్తున్న కంపెనీలు ఎథికల్ గైడ్‌లైన్స్‌పై ఫోకస్ చేస్తున్నాయి.
భవిష్యత్తు ఎలా ఉంటుంది?
ఏజీఐ వస్తే, మన లైఫ్ ఒక సినిమా సీన్‌లా మారిపోతుంది! నీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ బెస్ట్ ఫ్రెండ్‌లా, నీ పక్కనే 24/7 ఉంటుంది. నీ ఆలోచనలు, ఫీలింగ్స్ అర్థం చేసుకుని, నీ లైఫ్‌ను సూపర్ సింపుల్ చేస్తుంది. కానీ, ఈ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవాలి, లేదంటే రిస్క్‌లు కూడా ఉన్నాయి.
ఏజీఐ అంటే కేవలం ఒక టెక్నాలజీ కాదు, అది మన ఫ్యూచర్! ఇది మన లైఫ్‌ను ఈజీ చేస్తుంది, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
Also read: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది?
Also read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కవిత ?
Also read: జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక: పార్టీల్లో టెన్షన్
Also read: https://deepmind.google/discover/blog/taking-a-responsible-path-to-agi/