Telugu Word

బ్యాంకులు బాదేస్తున్నాయ్ బ్రో… చూసుకోండి! 💸

Bank Charges : బ్యాంకులు  మీకు తెలియకుండానే  మీ డబ్బును మెల్లగా లాగేస్తున్నాయని తెలుసా !  చాలా మంది ఖాతాదారులకు వీటిపై  అవగాహన లేకుండా చార్జీలకు బలవుతున్నారు. ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఫీజులు (Fund transfer fees), ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలు (ATM withdrawal charges), సీడీఎం డిపాజిట్ ఛార్జీలు (CDM Deposit Charges), మినిమం బ్యాలెన్స్ రుసుములు (Minimum balance charges) లాంటి ఛార్జీలతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. 

Banks

ఇవన్నీ ఒక్కో బ్యాంకుకు, ఖాతా రకానికి తగ్గట్టుగా  మారుతుంటాయి.  సేవింగ్స్ ఖాతా (Savings Account) అయినా, కరెంట్ ఖాతా (Current Account) అయినా చార్జీల మోత తప్పదు. చాలా మంది తమ బ్యాంక్ స్టేట్‌మెంట్లను పూర్తిగా పరిశీలించకపోవడంతో, తెలియకుండా హిడెన్ ఛార్జీలు (Hidden charges) వేయబడుతున్నాయి. చార్జీలు చిన్నవిగా కనిపించినా,  తర్వాత అవి పెద్ద మొత్తంగా మారే ఛాన్సుంది.


💥 మినిమం బ్యాలెన్స్ చార్జీల మోత (Minimum Balance Charges)

చాలా Bank Savings Accountల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి. కనిష్ట పరిమితి కంటే తక్కువగా ఉంటే, సాధారణంగా రూ. 300 నుంచి 1,000 వరకు జరిమానా పడుతుంది.
బ్యాంక్, ఖాతా రకాన్ని బట్టి ఫీజులు మారతాయి. కనీస నిల్వ లేకపోతే బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో వార్షిక లేదా నెలవారీ ఛార్జీలు వేస్తారు. 


🏧 ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీల బాదుడు ( ATM Withdrawal charges)

మీ బ్యాంకు ATM నుంచే డబ్బు తీసుకుంటే ఉచితం. కానీ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు తీస్తే, ప్రతి లావాదేవీపై రూ.20 నుంచి రూ.50 వరకు ఛార్జీలు ఉంటాయి.
లేటెస్ట్ RBI  ఆదేశించిన ప్రకారం, నెలవారీ ఉచిత పరిమితి దాటిన తరువాత ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేస్తున్నాయి.
TIP : మీ సొంత బ్యాంకు ATMలను మాత్రమే వాడటం బెటర్.


📝 చెక్ బౌన్స్ ఛార్జీలు (Cheque bounce charges)

చెక్కు బౌన్స్ అయినప్పుడు బ్యాంకులు రూ.250 నుంచి  రూ.500 వరకు జరిమానా విధిస్తాయి.
చెక్ బుక్ పొందడానికి రూ.100 వరకు వసూలు చేస్తారు.

TIP: చెక్కు రాసే ముందు ఖాతాలో సరిపడా cash ఉందో లేదో చెక్ చేసుకోవాలి.


💸 ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఫీజులు (Fund Transfer Feeses)

NEFT, RTGS లేదా IMPS ద్వారా డబ్బులు పంపడానికీ ఛార్జీలు ఉంటాయి.


🏦 లోన్ ప్రాసెసింగ్ ఫీజులు (Loan processing charges)

బ్యాంకులు లోన్ మొత్తం మీద 0.5% నుంచి 2% వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి.
రివార్డు పాయింట్లు రీడమ్ (Reward points redeem) చేసేటప్పుడు కూడా ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయి.
TIP : లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలను బాగా అర్ధం చేసుకోవాలి.


⚠️ ఖాతా నిర్వహణ రుసుములు (Account maintenance Charges)

కరెంట్ ఖాతాల కస్టమర్లు బ్యాంకు విధించిన నిబంధనలు పాటించకపోతే, నెలవారీ లేదా వార్షిక నిర్వహణ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.


💡 ఓవర్‌డ్రాఫ్ట్ ఛార్జీలు (Overdraft charges)

ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉన్న ఖాతాల్లో నెగటివ్ బ్యాలెన్స్ ఉంటే, బ్యాంకులు రూ.400 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తాయి.
TIP : చెకింగ్ ఖాతాలను సేవింగ్స్ ఖాతాలకు కనెక్ట్ చేయడం వల్ల ఛార్జీలు తగ్గే అవకాశం ఉంటుంది.


📱 అదనపు సేవా ఛార్జీలు (Additional Service Charges)


🚀 చార్జీలను తగ్గించుకోవడం ఎలా?

  1. ఖాతాల్లో minimum balance మెయింటైన్ చేయండి.
  2. మీ బ్యాంకు నెట్వర్క్ ATMలను మాత్రమే ఉపయోగించండి.
  3. UPI  & డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వండి.
  4. ఓవర్‌డ్రాఫ్ట్ ఛార్జీలను నివారించడానికి ఖాతాలను కనెక్ట్ చేయండి.
  5. చార్జీల గురించిన Latest updatesను బ్యాంకు నుంచి తెలుసుకుంటూ ఉండండి.
  6. తరచూ బ్యాంక్ స్టేట్‌మెంట్లను (Bank Statements) పరిశీలించండి.

🌟 ఫైనల్ టిప్ (Final TIP)

ఇలాంటి రహస్య చార్జీలను గుర్తించడంలో బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సక్రమంగా పరిశీలించడం చాలా ముఖ్యం. పూర్తి అవగాహన ఉంటే మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చు.

మీ డబ్బును బ్యాంకులకు అప్పనంగా ఇచ్చేయకండి !

జాగ్రత్తగా బ్యాంకింగ్ చేయండి, అవగాహనతో ముందుకు సాగండి! 💪

Read this also : Digital Loans : యాప్ లోన్ కావాలా? జాగ్రత్త… దెబ్బయిపోతారు !

Read this also : Credit Card: క్రెడిట్‌ కార్డులో లోన్ కావాలా ? జాగ్రత్త !

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Exit mobile version