పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు‘ మరో కీలక దశను దాటుతోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
తాజాగా చిత్రబృందం ఒక విశేషమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. మే 21న ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సినిమా వివరాలు, ప్రమోషన్ ప్లాన్‌లు, ఇతర ముఖ్య సమాచారం అధికారికంగా వెల్లడించనున్నారు.
Read This Also :ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. ‘వార్ 2’ నుంచి హృతిక్ గిఫ్ట్
Read This Also :దేశం కంటే ముందు ఆ పనిచేయండి: రేణు దేశాయ్ సంచలన కామెంట్స్
Read This Also :లాక్ చేసిన ‘కింగ్ డమ్’ యూనిట్… సెట్స్ నుంచి ఆసక్తికరమైన ఫోటో విడుదల