తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తోంది… ఈ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటూ సంచలనంగా మారుతోంది.
రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్ట్‌లు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని తెలిసింది.
కానీ, సినీ స్టార్స్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే షాకింగ్ న్యూస్ బయటకొస్తోంది.
సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా రెబ్బా, అనసూయ భరద్వాజ్… ఇంకా హెబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందా?
అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటి?
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు (2018-2023) మధ్య స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) ద్వారా భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆపరేషన్‌కి మాజీ SIB చీఫ్ టి. ప్రభాకర్ రావు నాయకత్వం వహించారని, ఆయన సహాయకులైన డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కలిసి ఈ పని చేశారని ఆరోపణలు. ఈ ట్యాపింగ్‌లో రాజకీయ నాయకులు, జడ్జిలు, జర్నలిస్ట్‌లతో పాటు సినీ స్టార్స్ ఫోన్లు కూడా టార్గెట్ అయినట్లు వార్తలు ఉన్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక, ఈ డేటాని డిస్ట్రాయ్ చేశారని, హార్డ్ డిస్క్‌లను కట్టర్‌తో నాశనం చేశారని సిట్ దర్యాప్తు చేస్తోంది. లిటికల్ లీడర్లు ఓకే… సినీ స్టార్స్ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది… అనేది ఇప్పుడు డౌట్. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా రెబ్బా లాంటి టాలీవుడ్ స్టార్స్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు బయటపడింది.
ఇప్పుడు జబర్దస్త్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాదు హెబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఈ కేసుకి కొత్త డైమెన్షన్ ఇచ్చింది.
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ ఆరోపణలు
2024 అక్టోబర్‌లో మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ సినీ నటీమణుల ఫోన్లను ట్యాప్ చేయించి, వాళ్లను బ్లాక్‌మెయిల్ చేశారని, సమంత-నాగచైతన్య విడాకులకు కూడా కేటీఆర్ కారణమని ఆమె అన్నారు. ఈ ఆరోపణలు భారీ వివాదానికి దారితీశాయి. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సమంత తన విడాకులు పర్సనల్ అని, రాజకీయ నాయకులు తమ పేర్లను వాడొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రకుల్ కూడా, “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా బేస్‌లెస్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం దారుణం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున కూడా కొండా సురేఖపై డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు.
అనసూయ, హెబ్బా పటేల్ ఫోన్లు ట్యాప్ అయ్యాయా?
అనసూయ భరద్వాజ్ ఫోన్ ట్యాప్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి ధ్రువీకరణ లేదు. అనసూయ లేదా ఆమె టీమ్ నుంచి ఇంకా ఎలాంటి స్టేట్‌మెంట్ రాలేదు. హెబ్బా పటేల్ విషయంలోనూ, కౌశిక్ రెడ్డి ప్రశ్నించిన తర్వాత సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అయింది, కానీ దీనిపై కూడా క్లారిటీ లేదు. సినీ స్టార్స్ మాత్రం ఈ విషయంలో బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడటం లేదు, ఎందుకంటే ఇది వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ.
కొందరు స్టార్స్ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)కి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని, బహిరంగ విచారణకు రాబోమని చెబుతున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఏమైంది?
2024 మార్చిలో ఈ కేసు బయటకొచ్చింది. డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్‌తో మొదలైన ఈ విచారణ, ఆ తర్వాత అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను కూడా అరెస్ట్ చేశారు. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు, ఆయనపై లుక్‌అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. 2025 జూన్‌లో ప్రభాకర్ రావు భారత్‌కి తిరిగొచ్చి, సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. 2024 జూన్‌లో ఆరుగురిపై ఛార్జిషీట్ ఫైల్ చేశారు, కానీ బీఆర్ఎస్ నాయకులెవరి పేరూ అందులో లేదు.
సినీ స్టార్స్ ఎందుకు టార్గెట్?
ఈ కేసులో సినీ స్టార్స్ ఫోన్లు ఎందుకు ట్యాప్ అయ్యాయనే దానిపై స్పష్టత లేదు. కొందరు రాజకీయ విశ్లేషకులు, ఈ స్టార్స్‌కి పొలిటికల్ లీడర్స్ తో సంబంధాలు ఉండొచ్చని, వాళ్ల ఫైనాన్షియల్ డీల్స్ గురించి ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించేందుకు ట్యాపింగ్ జరిగి ఉండొచ్చని అంటున్నారు.
అంతేకాదు, కొందరు స్టార్స్‌ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఈ డేటాని ఉపయోగించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో సమంత, రకుల్ లాంటి స్టార్స్ బహిరంగంగా మాట్లాడినా, మిగిలిన వాళ్లు ప్రైవసీ కారణాలతో సైలెంట్‌గా ఉన్నారు.
క్లైమాక్స్ ఏంటంటే?
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో భారీ సంచలనం సృష్టిస్తోంది. సమంత, రకుల్, ఈషా రెబ్బా, అనసూయ, హెబ్బా పటేల్ లాంటి స్టార్స్ ఫోన్లు ట్యాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి, కానీ అధికారిక ధ్రువీకరణ అయితే ఏదీ లేదు. సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది, మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికే విచారణకు హాజరైనా, ఈ కేసులో పెద్ద నాయకులు ఎవరు ఇరుక్కుంటారా అనేది చూడాలి.
Also read: కూకట్ పల్లి పీఎస్ లో కంప్లయింట్
Also read: వామ్మో.. ఇన్ని లోపాలా?
Also read: అమ్మ ఆరోగ్యం బావుంది: నాగబాబు