ప్రస్తుతం హైదరాబాద్ లో ఇళ్ళు, అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ రేట్లు దిగి వచ్చాయి. అయితే ఏ ఏరియాలో ఎంత వరకూ రేటు పెట్టొచ్చు అన్న దానిపై చాలామందికి డౌట్స్ ఉన్నాయి. 6 నెలల క్రితం వరకూ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఏరియాలో ఎంత రేట్లు ఉన్నాయి… ప్రస్తుతం ఎంత నడుస్తోంది… Telugu Word telegram మీకు అందిస్తోంది. ఆ రేట్లు… ఇప్పటి ధరలు పోల్చుకొని బేరం ఆడుకోవడం మంచిది. ఈ రేట్లల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. జస్ట్ ఇల్లు కొనుగోలు దారులకు అవగాహన కోసం ఇస్తున్నాం.
బాచుపల్లి (Bachupally):
బాచుపల్లిలో రియల్ ఎస్టేట్ కు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,750 ఉన్నాయి. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 5,600కి చేరుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు రూ.5700 నడుస్తోంది.
మియాపూర్ (Miyapur):
మియాపూర్ లో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 6,900గా ఉన్నది. ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 6 వేల దాకా ఇచ్చారు. ప్రస్తుతం రూ.6500 దాకా కొనసాగుతోంది.
నిజాంపేట్ (Nizampet):
నిజాంపేటలో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,350గా ఉంది. అది జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 5,200 వరకూ నడిచింది. మళ్ళీ ఈ నవంబర్ లో స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం నిజాంపేటలో రూ.5600/ sq.ft నడుస్తోంది.
బీరంగూడ (Beeramguda):
బీరంగూడ ఏరియాలో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 4,250 ఉంది. ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్టు నెలలో రూ. 4,200కి తగ్గింది. ప్రస్తుతం నవంబర్ 2024 లో అది రూ.4550/sq.ft గా నడుస్తోంది.
కూకట్ పల్లి (Kukatpally):
కూకట్ పల్లిలో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 6,500గా ఉంది. ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్టు నెల మధ్యలో రూ. 5,700లుగా పలికింది. మళ్ళీ పాత రేట్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం 2024 నవంబర్ లో రూ.6550/sq.ft గా నడుస్తోంది.
కొంపల్లి (Kompally):
సికింద్రాబాద్ పరిధిలో ఉన్న కొంపల్లిలో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,950 ఉండేది. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 5,250కి పడిపోయింది. 2024 నవంబర్ లో ఈ ఏరియాలో రూ.5,600/sq.ft పలుకుతోంది.
రాజేంద్రనగర్ (Rajendra Nagar):
రాజేంద్రనగర్ లో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,450 ఉండగా.. ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 6,900కి తగ్గింది. ప్రస్తుతం మళ్ళీ రూ.7,350/sq.ft గా నడుస్తోంది.
Read also : Hyderabad Real Estate : సిటీలో ఇల్లు కొంటారా ? మంచి ఛాన్స్ !!
బంజారాహిల్స్ (Banjara Hills):
సెంట్రల్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 10,200 ఉంది. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ.9,600కి తగ్గింది. ప్రస్తుతం నవంబర్ 2024లో ఇంకా తగ్గింది. ప్రస్తుతం బంజారా హిల్స్ లో రూ.8,400/sq.ft నడుస్తోంది.
ఎల్బీ నగర్ (LB Nagar):
ఎల్బీనగర్ లో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 6,350 ఉండగా.. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 6,250కి తగ్గింది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ ఏరియాలో రూ.6,300/sq.ft నడుస్తోంది.
మణికొండ (Manikonda):
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న మణికొండ ఏరియాల్లో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,750 ఉంది. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 6,850గా ఉంది. ప్రస్తుతం రూ.7250/sq.ft గా ఉంది.
పుప్పాలగూడ (Puppalaguda):
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న పుప్పాలగూడలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 9,500 ఉండగా ఇప్పుడు రూ. 7,800కి తగ్గింది. చదరపు అడుగు మీద ఏకంగా రూ. 1700 తగ్గింది. కానీ నవంబర్ 2024లో తిరిగి పుంజుకుంది. ప్రస్తుతం రూ.9000/sq.ft నడుస్తోంది.
నార్సింగి (Narsingi):
నార్సింగిలో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 9,950 ఉండగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 8,200కి తగ్గింది. నవంబర్ 2024లో ఇక్కడ 10వేలు /sq.ft పలుకుతోంది.
అప్పా జంక్షన్ (Appa Junction):
అప్పా జంక్షన్ లో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 8,100 ఉండేది. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 7,850కి తగ్గింది. ప్రస్తుతం కూడా స్వల్పంగా పెరిగింది. అంటే నవంబర్ 2024 నాటికి రూ.7,900/sq.ft పలుకుతోంది.
Read Also :Home Loan Top up తీసుకుంటున్నారా ?
నెక్నాంపూర్ (Neknampur):
నెక్నాంపూర్ లో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,700 ఉండేది. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 6,500కి తగ్గింది. ఇప్పుడు నవంబర్ 2024లో రూ.6700/sq.ft పలుకుతోంది.
తెల్లాపూర్ (Tellapur):
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న తెల్లాపూర్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,150 ఉండగా.. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 6,800గా ఉంది. నవంబర్ 2024 లో రూ.7,800/sq.ft పలుకుతోంది.
హఫీజ్ పేట్ (Hafizpet):
హఫీజ్ పేట్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,650 ఉండగా.. జూన్ టు ఆగస్టు వరకూ రూ. 6,900కి తగ్గింది. ప్రస్తుతం నవంబర్ 2024లో కూడా అదే రేటు నడుస్తోంది.
మదీనాగూడ (Madinaguda):
మదీనాగూడలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 6,500 ఉండగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 6,450గా ఉంది. ప్రస్తుతం ఇంకా తగ్గింది. ఇక్కడ రూ.6,350/sq.ft నడుస్తోంది.
కొల్లూరు (Kollur) :
కొల్లూరులో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,250 ఉండగా.. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 4,950కి తగ్గింది. అంటే చదరపు అడుగు మీద రూ. 300 తగ్గింది. ప్రస్తుతం కొల్లూరు ఏరియాలో రూ.5,950/sq.ft పలుకుతోంది.
Read also : మారుతి బంపర్ బొనాంజా : లక్ష దాకా డిస్కౌంట్స్
కోకాపేట (Kokapet):
కోకాపేటలో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 10,600 ఉండగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 9,900కి పడిపోయింది. చదరపు అడుగు మీద రూ. 700 తగ్గింది. ఆ తర్వాత ప్రస్తుతం అంటే 2024 నవంబర్ లో రూ.10,400/sq.ft పలుకుతున్నాయి.
కొండాపూర్ (Kondapur):
కొండాపూర్ లో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 10,200 ఉంది. జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 9,400కి పడిపోయింది. చదరపు అడుగు మీద రూ. 800 తగ్గింది. ఆ తర్వాత నవంబర్ 2024 లో కొండాపూర్ లో రూ. 10,300 నడుస్తోంది.
గచ్చిబౌలి (Gachhibowli):
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న గచ్చిబౌలిలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 10,650 ఉండగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 10,300కి చేరుకుంది. ప్రస్తుతం కూడా దాదాపు అదే రేటు నడుస్తోంది. రూ.10,350/sqft నడుస్తోంది.
మాదాపూర్ (Madapur):
మాదాపూర్ లో 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 9,950 ఉండగా, జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ రూ. 6,950కి పడిపోయింది. అంటే ఏకంగా 3 వేలు పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంది. ప్రస్తుతం 2024 నవంబర్ లో రూ.10,750/sq. ft నడుస్తోంది.