మారుతి బంపర్ బొనాంజా : లక్ష దాకా డిస్కౌంట్స్

Money Matters Trending Now

ప్రతి యేటా దసరా, దీపావళి పండగ సీజన్ కార్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు పెద్ద పండగ. భారీగా సేల్స్ అవడంతో పాటు… లాభాలను కూడా తీసుకొస్తాయి. కానీ దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీకి (Maruti Suzuki) ఈసారి అంతగా వర్కవుట్ అయినట్టు లేదు. అందుకే పండగలు అయిపోయాక… ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్స్ పై భారీగా ధమాకా ప్రకటించింది.

మారుతి సుజుకీ కొన్ని మోడళ్లను ధరలను తగ్గించడంతో పాటు Additional benefits కూడా అందిస్తోంది. సెలెక్టెడ్ మోడల్స్ పై ఈ నెలాఖరు (నవంబర్ 2024) దాకా రాయితీలను అందుబాటులోకి తెచ్చింది. ఏ మోడల్స్ పై రాయితీలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

Maruti – Altro, S-Presso, Celerio Models

మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ఈ రేంజ్ మూడు కార్లపై రూ.50 వేల వరకు తగ్గించింది మారుతి. ఇందులో Manual modelపై రూ.30 వేలు, AMT Modelపై రూ.35 వేలు Cash Discount ఇస్తోంది. అదనంగా రూ.15 వేలు Exchange Bonus కూడా ఇస్తోంది. ఇంకా Corporate Discount కింద మరో రూ.2 వేలు డిస్కౌంట్ లభిస్తోంది.

Maruti – WagonR, New Swift Models

WagonRతో పాటు ఈమధ్యే మార్కెట్లోకి వచ్చిన New Swift కార్లపై మారుతీ Discounts ఇస్తోంది. WagonR మీద రూ.25 వేల వరకు Cash Discount లేదంటే రూ.30 వేల విలువైన విడిభాగాల కిట్ ప్యాకేజీ… ఈ రెండింటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఇంకా Exchange Bonus కింద మరో రూ.15 వేలు, Corporate Discount కింద మరో రూ.2 వేల Discount లభిస్తుంది. మారుతి మోడల్స్ లో Swift కారుకి ఫుల్లు డిమాండ్ ఉంటుంది. మిడిల్ క్లాస్ కూడా పెద్ద సంఖ్యలో ఈ మోడల్ నే కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మరిన్ని additional features తో వచ్చిన Swift latest model కారుపైనా డిస్కౌంట్స్ దొరుకుతోంది. రూ.50 వేల వరకు రాయితీ తోపాటు అదనంగా Exchange Bonus కింద మరో రూ.15 వేలు అందిస్తున్నారు. అలాగే DZire(Old Model), Brezzaపై రూ.15 వేల Cash Discount, Exchange Bonus కింది మరో రూ.15 వేల వరకూ ఆఫర్ ఇస్తున్నారు.

Maruti- BALENO Other Models

IGNIS, BALENOతోపాటు ఇతర Maruti Models కొనే వారికి లక్ష రూపాయల దాకా Discount వస్తోంది. వీటిలో IGNIS, BALENOపై రూ.45 వేల వరకు Cash Discount, Exchange Bonus కింద రూ.15 వేలు, Corporate discount కింద రూ.2,100 ఇస్తోంది. అలాగే FRONX, CIAZపై రూ.50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. కానీ ZIMNY ZETAపై చాలా ఎక్కువగా రూ.1.95 లక్షలు, ZIMNY ALFAపై రూ.2.5 లక్షల తగ్గింపు ఇస్తోంది మారుతి సుజికీ. అలాగే XL6, GRAND VITARA, INVICTOపై క్యాష్ డిస్కౌంట్ కింద రూ.40 వేలు, Exchange Bonus కింద మరో రూ.20 వేలు, GRAND VITARAపై రూ.50 వేలు క్యాష్ డిస్కౌంట్ తోపాటు అదనంగా రూ.1.05 లక్షల exhcange bonus ఇస్తోంది మారుతి సుజికీ.

ప్రస్తుతానికి నవంబర్ నెలాఖరు దాకా ఈ డిస్కౌంట్స్ ఇస్తున్నా…Year end discounts కింద డిసెంబర్ లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

Tagged