సొంతింటి కలను నిజం చేసుకోడానికి… లేదంటే భూమి మీద దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయి అనుకునే వారికి శుభవార్త. ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఇండ్ల ధరలు కాస్త తగ్గాయి. ఈమధ్య కాలంలో హైడ్రా (HYDRA) దూకుడుగా వెళ్ళడంతో ఎక్కడ ఇల్లు కొంటే ఎప్పుడు కూలగొడతారో అన్న భయం చాలా మందిలో ఉంది. గత అక్టోబర్ లో 20శాతం రిజిస్ట్రేషన్లు మాత్రమే పుంజుకున్నాయి. అంటే జనం ఇప్పుడిప్పుడే ఇళ్ళ కొనుగోళ్ళకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో రియల్ ఎస్టేట్ (Hyderabad Real Estate)లో పెట్టుబడులు పెట్టడం బెటర్. సొంత ఇంటి కల నెరవేర్చుకోడానికి ఇదే మంచి సమయం అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.
Read Also : మారుతి బంపర్ బొనాంజా : లక్ష దాకా డిస్కౌంట్స్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అంతగా స్పీడప్ లేదు. ఇదే పరిస్థితి హైదరాబాద్ లో కూడా కంటిన్యూ అవుతోంది. అందుకే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఇళ్ళు కొనేవారిని ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్పీడప్ అయింది. గత కొన్నేళ్ళుగా రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌లో టాప్ ప్లేసులో ఉంటోంది. మళ్ళీ బిజినెస్ పెరుగుతుండటం, ఎంక్వయిరీలు కూడా మొదలైనట్టు క్రెడాయ్ చెబుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేసులో ఉంది. తరువాత బెంగళూరు (Bangalore) సిటీ సెకండ్ ప్లేసులో ఉంది. ఆ తర్వాతే ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై సిటీలు ఉన్నాయి. రెసిడెన్షియల్ గానే కాదు… ఆఫీస్ స్పేస్ విషయంలోనూ హైదరాబాద్ లో గత కొంతకాలంగా అభివృద్ధి కనిపిస్తోంది.
Read this also : Home Loan Top up తీసుకుంటున్నారా ?
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అపార్టుమెంట్లు నిర్మిస్తున్న బడా సంస్థలు ముందస్తు బుకింగ్ కన్నా కాస్త తక్కువగా కొనుగోలుదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇల్లు కొనాలంటే ఇదే మంచి సమయం అని, ఆఫర్లు కూడా ఉన్నాయని ఊరిస్తున్నారు. హైదరాబాద్ లో ఆరు నెలల క్రితం ధరలతో పోలిస్తే ఇప్పుడు రేట్లు కూడా పెద్దగా పెరగలేదు. అటు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అప్పటి ధరల మీదే ఆఫర్లు ఇస్తామంటున్నాయి. చిన్నచిన్న రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా తమ ప్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్ళ ధరలు కాస్త తగ్గించి అమ్ముకుంటున్నాయి. బిల్డర్లకు కూడా రేటు తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోతుండటం, మనీ రొటేషన్ కాకపోవడంతో రియల్ సంస్థలు ఈ రిబేట్ బిజినెస్ మొదలుపెట్టాయి. ఎక్కువ లాభాలు అవసరం లేదు… కొంత తగ్గినా ఫర్వాలేదు… ప్రాపర్టీ అమ్ముడు పోతే చాలు అనుకుంటున్నాయి. అందుకే వినియోగదారులు కూడా ఇదే మంచి సమయం
Read Also : Hyderabad Home Rates : ఏ ఏరియాలో ఏ రేట్లు ?
ఇలాంటి మంచి కథనాలు అందిస్తున్న తెలుగు వర్డ్ వెబ్ సైట్ Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Click here : Telugu Word Telegram Link