పితృదేవతలను స్మరించుకోడానికి… జ్యేష్ఠ అమావాస్య అనకులమైన రోజు. ఈనెల అంటే 2025 జూన్ 25 నాడు జ్యేష్ఠ అమావాస్య వస్తోంది. ఆరోజు పూజలు, దానధర్మాలు మొదలైన కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణాలు విడుస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు ప్రశాంతంగా ఉంటారనీ, వాళ్ళ ఆశీస్సులు మనకు అందుతాయని పురణాలు చెబుతున్నాయి.
ఆ రోజు ఏం చేయాలి
జూన్ 25 న జ్యేష్ఠ అమావాస్య రోజున నదీ స్నానం చేసి పరమశివుణ్ణి పూజించారు. అలా చేయడం వల్ల తెలిసీ తెలియక మనం చేసిన పాపాలు నశిస్తాయి. అలాగే మనసులోని కోరికలు నెరవేరతాయి. ఏవైనా అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల శరీరం, మనసు, ఆత్మ కూడా శుద్ధి అవుతాయట. పెళ్లయిన మహిళలు కుటుంబంలో సుఖసంతోషాలు వర్థిల్లాలని, పెళ్ళి తర్వాత జీవితం ఆనందంగా సాగాలని ప్రార్థన చేస్తారు. పెళ్లికాని అమ్మాయిలు అయితే… తమ జీవితంలోకి మంచి భర్త రావాలని కోరుకుంటూ రావి చెట్టుకు పూజిస్తారు.
అలాగే సావిత్రి కథను చదువుతారు లేదా వినవచ్చు. జూన్ 25 జ్యేష్ఠ అమావాస్య రోజున సంధ్యా సమయంలో దీప దానం చేస్తే శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. రావిచెట్టు ముందు దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేస్తారు. ఈ రోజున రావిచెట్టును పూజించడంతో పాటు రావి మొక్కను నాటితే సంతానం కలుగుతుందని నమ్ముతారు.
జ్యేష్ఠ అమావాస్య రోజున ఏం చేయకూడదు.
జ్యేష్ఠ అమావాస్య రోజున మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి. డబ్బు అప్పుగా తీసుకోకూడదు. కొత్త వస్తువులు కొనకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమ వల్ల ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు.
Also read: నా కూతురు జోలికొస్తే.. కారుతో ఢీకొడతా: కాజోల్
Also read: ‘ది రాజా సాబ్’ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ లో కోత
Also read: పవన్ ఫ్యాన్స్ బీ రెడీ.. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
Also read: ఆల్ టైమ్ హిట్ గా ‘కుబేర’