New Financial Year 2025: ఇవాళ్టి నుంచి మారే 11 రూల్స్ !

Latest Posts Personal Finance Top Stories Trending Now

Telugu Word టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి !! CLICK HERE 

New Financial Year 2025 changes :

కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26లోకి అడుగు పెట్టాం. దాంతో ఏప్రిల్ 1 నుంచి మన ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేసే కొన్ని మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు:

01) ఆదాయపు పన్ను మినహాయింపు (Income Tax Exemption)

సాధారణ వ్యక్తులకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు. ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు రూ.75,000తో కలిపి రూ.12,75,000 వరకూ పన్ను వర్తించదు. ఈ ఆదాయానికి మించి ఉన్న వారికి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. ఆదాయపు పన్ను అప్‌డేటెడ్‌ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు 12 నెలల నుంచి 48 నెలలకు పెరిగింది.

02) గృహ రుణాల ప్రాధాన్యం (Home Loan Priority)

ఏప్రిల్‌ 1 నుంచి పెద్ద నగరాల్లో రూ.50 లక్షలు, మధ్య తరహా నగరాల్లో రూ.45 లక్షలు, చిన్న పట్టణాల్లో రూ.35 లక్షల గృహ రుణాలు ప్రాధాన్య రంగ రుణాలుగా లభిస్తాయి.

03) UPI నిబంధనలు (UPI Rule Change)

UPI లావాదేవీల‌ను పటిష్టంగా నిర్వహించేందుకు కొత్త security systemని చేప‌ట్టారు. UPIతో లింక్ ఉన్న inactive numbersని deactivate చేయ‌నున్నారు. మొబైల్ నెంబర్లు మారితే, బ్యాంకుకు వెళ్లి కొత్త నంబరును నమోదు చేయించాలి. ATM లేదా మొబైల్ బ్యాంకింగ్‌ ద్వారా కొత్త నంబర్లను నమోదు చేసుకోవచ్చు.

04) సీనియర్ సిటిజన్లకు TDS రాయితీ (TDS Exemption for Senior Citizens)

వడ్డీ ఆదాయంపై వర్తించే మూలం వద్ద పన్ను కోత (TDS) సీనియర్‌ సిటిజన్లకు రూ.లక్ష వరకూ ఉండదు.

05) డీమ్యాట్‌ ఖాతాలకు KYC (Demat Account KYC)

డీమ్యాట్‌ ఖాతా, మ్యూచువల్‌ ఫండ్లలో KYC వివరాలను మరోసారి తెలియజేయాలి. నామినీ వివరాలను ధ్రువీకరించాలి.

06) హోటల్, రెస్టారెంట్లలో GST (GST on Hotel Restaurant Services)

రూ.7,500లకు పైగా గది అద్దె ఉన్న హోటళ్లలో రెస్టారెంట్‌ సేవలపై 18 శాతం GST వర్తిస్తుంది.

07) చెక్కు చెల్లింపుల నియంత్రణ (Cheque Payment Regulation)

రూ.50,000కు పైగా ఉన్న చెక్కు చెల్లింపుల కోసం ఖాతాదారులు ఎలక్ట్రానిక్‌ రూపంలో వివరాలు సమర్పించాలి. చెక్కు సంఖ్య, ఎవరికి ఇచ్చారు, ఎంత మొత్తం లాంటి వివరాలు తెలియజేయాలి. ఆ వివరాలను బ్యాంకు ధ్రువీకరించిన తర్వాతే చెల్లింపు జరుగుతుంది.

08) ప్రీమియం చెల్లింపులపై పన్ను (Tax on Insurance Premium)

రూ.2.5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించిన యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలను వెనక్కి తీసుకున్నప్పుడు వచ్చిన లాభాన్ని మూలధన రాబడిగా పరిగణిస్తారు. ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

10) పెన్షన్ స్కీమ్ అమలు (Unified Pension Scheme)

2024 ఆగ‌స్టులో ప్రవేశపెట్టిన యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ స్కీమ్‌తో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు లాభం చేకూర‌నుంది.

11) కనీస బ్యాంక్ బ్యాలెన్స్ మార్పులు (Minimum Bank Balance Rules)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, కెన‌రా బ్యాంకు లాంటి బ్యాంకులు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి కనీస బ్యాలెన్స్ రూల్స్‌ను (minimum bank balance) మార్చుతున్నాయి. కనీస బ్యాలెన్స్‌ ఉంచని కస్టమర్లకు జరిమానా విధిస్తారు.

Conclusion

కొత్త ఆర్థిక సంవత్సరం 2025లో వివిధ మార్పులు అమలులోకి వచ్చాయి. ఆదాయపు పన్ను మినహాయింపు, UPI Rules, Home Loans, బ్యాంకింగ్ నియంత్రణలు లాంటి మార్పులను జాగ్రత్తగా గమనించి, సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Telugu Word టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి !! CLICK HERE 

ఇది కూడా చదవండి : బ్యాంకులు బాదేస్తున్నాయ్ బ్రో… చూసుకోండి!

ఇది కూడా చదవండి : ఎండలో కారు నడుపుతున్నారా? Be Careful!

Read this also : వాట్సాప్ హ్యాక్ అయితే కొంప కొల్లేరే !

Tagged

Leave a Reply