తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. తాగి వాహనాలు నడిపినా… స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేసినా జైలుకు పంపడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ లో ఆంక్షలు
- ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
- హైదరాబాద్ లో ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఫ్లై ఓవర్లు మూసేస్తున్నారు.
- డీజేలు వాడకూడదు. మ్యూజికల్ ఈవెంట్స్ అయితే ఇండోర్ లో మాత్రమే జరుపుకోవాలి. 45 డెసిబుల్స్ కి మించి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తే యాక్షన్ తప్పదు.
- నిర్వాహకులు అసభ్యకరమైన డ్యాన్సులు, డ్రెస్సింగ్ లను అనుమతించరాదు.
- లిక్కర్ పార్టీల్లోకి మైనర్లను అనుమతించకూడదు.
- బార్స్, వాక్ వేస్, టాయిలెట్స్, లిఫ్టులు, కారిడార్ల దగ్గర స్టాఫ్ ని నియమించాలి.
- ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్స్, పార్కింగ్ ఏరియాల్లో తప్పనిసరిగా సీసీ టీవీ కెమెరాలు మెయింటైన్ చేయాలి. భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను నియమించాలి.
- న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడినట్టు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటారు.
- తాగి బండి నడపకూడదు. డ్రంకెన్ కండీషన్ లో ఉన్న వారు వెహికిల్స్ నడపవద్దని హెచ్చరిక బోర్డులను హోటల్స్, పబ్స్, క్లబ్స్ ముందు పెట్టాలి.
- అవసరమైతే అలాంటివారికి డ్రైవర్ ని ఇచ్చి ఇంటి దగ్గర దిగబెట్టే ప్రయత్నం చేయాలి.
- ORR పై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా లైట్ మోటార్ వెహికల్స్ ను అనుమతించరు. హెవీ వెహికల్స్ కి మాత్రమే అనుమతి ఉంది
Read this also :New Year వేడుకల్లో జాగ్రత్త : పోలీసులు తాట తీస్తారు
Read This also : ఆ గ్రీటింగ్స్ క్లిక్ చేశారో… మీ ఖాతా ఖాళీ !