సూపర్ హిట్ మూవీ సీక్వెల్, ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ మూవీ, సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న సినిమా కావడంతో ‘వార్ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ స్పై థ్రిల్లర్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఇప్పటి వరకు వచ్చిన స్పై థ్రిల్లర్స్‌తో పోల్చితే ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ పోస్టర్ ను రెడీ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
కియారా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉన్న ఈ పోస్టర్ ఈ మూవీపై హీట్ పెంచుతోంది. లేటేస్ట్ గా దీనిపై ఎన్టీఆర్ ఓ పోస్ట్ పెట్టారు. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి వార్ ను మీరెప్పుడూ చూసుండరు.. కౌంట్ డౌన్ స్టార్ చేయండి’ అంటూ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ ఈ లెవల్లో చెప్పడంతో దీనిపై బజ్ ఇంకా పెరిగింది. మరో 50 రోజుల్లో రిలీజవుతున్న ‘వార్ 2’మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
Also read: ఫైటర్ గా రష్మిక మందన్నా
Also read: జాడ లేని ఇరాన్ సుప్రీం లీడర్
Also read: జూబ్లీహిల్స్ లో నందమూరి వారసురాలు పోటీ
Also read: https://in.bookmyshow.com/movies/mumbai/war-2/ET00356501