Telugu Word

ఒబెసిటీతో గజినీలు అవుతారు !

Obesity Alzheimer:  మీరు బరువు పెరిగిపోతున్నారా ? పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.. అయితే జాగ్రత్త తొందర్లోనే మీరు అల్జీమర్స్ బారిన పడే ఛాన్సుంది. అంటే మీరేం చేస్తున్నారో మీకు గుర్తుండదు.  పూర్తిగా మర్చిపోతారు. గజనీలు అయిపోతారు.   50 నుంచి 60యేళ్ళ వయస్సులో ఇలాంటి సమస్య మిమ్మల్ని పలకరించే ఛాన్సుంది. సో… స్థూలకాయాన్ని తగ్గించుకోవాలని లేటెస్ట్ స్టడీ ద్వారా అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Obesity

ఒబెసిటీతో బాధపడేవాళ్ళల్లో భవిష్యత్తులో మతిమరుపు సమస్య గ్యారంటీ అంటున్నారు అమెరికా పరిశోధకులు. రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా Annual Meetingలో ఈ పరిశోధన పత్రాన్ని submit చేశారు. అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవడంతో పాటు.. అల్జీమర్స్ ముప్పు కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. శరీరంలో చాలా కాలికంగా నడుం చుట్టూ పేరుకున్న కొవ్వు (బెల్లీ ఫ్యాట్)కు అల్జీమర్స్ కి కారణమయ్యే అమిలైడ్ ప్లేక్స్ టౌ టాంజిల్స్ అనే ప్రొటీన్ల మధ్య ఉన్న సంబంధం ఉన్నట్టు గుర్తించారు. కొవ్వు శాతం పెరుగుతున్న కొద్దీ… మెదడులో ఈ అసహజ ప్రొటీన్ల స్థాయి increase అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో అల్జీమర్స్ వ్యాధి అతి పెద్ద సమస్యగా మారింది. అక్కడ దాదాపు 60 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అల్జీమర్స్ ని నివారించకపోతే 2050 నాటికి బాధితుల సంఖ్య ఏకంగా కోటీ 30 లక్షలకు పెరిగే ఛాన్సుందని అల్జీమర్స్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. మన భారత్ లో 80 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది

ఒబెసిటీ కలిగిన వాళ్ళల్లో అవయవాల చుట్టూ అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దాంతో మెదడుకు రక్తం సరఫరా తగ్గుతుందని స్టడీలో తేల్చారు. బరువు తగ్గడం, కొవ్వు కరిగించడం వల్ల అల్జీమర్స్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. లేదంటే కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంటుందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పుడు ఏం చేయాలి ?

ఒబెసిటీ వల్ల మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అల్జీమర్స్ ఒక్కటే కాదు… గుండె జబ్బులతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా ఎటాక్ అయ్యే ఛాన్సుంది. శరీరం లోపల అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటే ఇన్సులిన్ రిలీజ్ ను ఆపేస్తుంది. దాంతో ఆలోచన శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.

🤔 ఒబెసిటీ ఉన్నవారు జీవన శైలిలో తప్పనిసరిగా మార్పు చేసుకోవాల్సిందే. ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉండాలి.

🤔 భోజనంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తృణధాన్యాలు (Millets) ను ఎక్కువగా తీసుకోవాలి.

🤔 ఆరోగ్యకరమైన కొవ్వులుండే (Good Cholesterol) ఆహారం తీసుకోవాలి

🤔 ప్రతి రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిందే.

🤔 గుండె ఆరోగ్యంపైనా ఎక్కువగా దృష్టి పెట్టాలి.

🤔 మెదడు యాక్టివ్ గా ఉండటానికి పజిల్స్, సూడుకోలు పూర్తి చేయాలి.

🤔 ఎక్కువగా పుస్తకాలు చదవాలి… కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టాలి

🤔 డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

🤔 బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

🤔 ఒత్తిడి బారిన పడకుండా ధ్యానం, యోగాలాంటి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.

Read also : ఐటీ పీపుల్ కి ఫ్యాటీ లివర్ !

Find the article in Harvard Medical School : https://www.health.harvard.edu/mind-and-mood/high-levels-of-visceral-fat-may-predict-alzheimers

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Read also : జాగ్రత్త… కాల్ మెర్జింగ్ తో ఖాతా ఖాళీ !

Exit mobile version