గన్ తో పవన్ కల్యాన్ న్యూ లుక్
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై విలయ తాండవం చేయబోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పొలిటికల్ గా ప్రభంజనం సృష్టించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారా అని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ అందుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాలోని పోస్టర్ ఒకటి వైరల్ గా మారింది. ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ గన్ పట్టుకున్న పోస్టులను రిలీజ్ చేశారు మేకర్. ఇప్పుడు పవన్ పట్టుకున్న ఆ గన్ పై ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ పెరిగింది. చాలామంది ఈ గన్ సంగతి ఏంటాని ప్రశ్నిస్తున్నారు .
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా కనిపించబోతున్నారు.
ఇది 18వ శతాబ్దానికి చెందిన స్టోరీ. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ మొగలుల సామ్రాజ్యంపై యుద్ధం చేయబోతున్నారు. కోహినూర్ డైమండ్ ను వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నమే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లో భారీ యుద్ధ సన్నివేశాలు, కత్తి యుద్ధాలు ఉండనున్నాయి. పవన్ కళ్యాణ్ అందుకోసం సపరేట్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. పీరియాడి క్ సినిమాలను రూపొందించే సమయంలో దర్శక నిర్మాతలు ఆయా కాలాలకు అనుగుణంగా, కథకు అనుగుణంగా భారీ సెట్స్ ను నిర్మిస్తారు. అదే సమయంలో కథకు కావలసిన ప్రత్యేక ఆయుధాలను కూడా తయారు చేయిస్తారు. హరి హర వీరమల్లు సినిమా కోసం మ్యాచ్ లాక్ అనే పొడవాటి గన్ ను తయారు చేయించారు. పవన్ కళ్యాణ్ చేతిలో పట్టుకున్న ఆ పొడవాటి మ్యాచ్ లాక్ గన్ ను చూస్తుంటే పవన్ మొఘల్ సామ్రాజ్యంలో ఆర్మీ ఆఫీసర్ గా విధులు నిర్వహించే సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఆ గన్ ను మొఘల్ ఆర్మీ ఆఫీసర్లు 16 నుంచి 18వ శతాబ్దంలో ఉపయోగించారట. ప్రస్తుతం ఆ సినిమాకు అలాంటి గన్ నే తయారు చేయించారు. ఇక ఈ నిర్మాత ఏఎం రత్నం 250 కోట్ల రూపాయలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. కానీ ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ..సినిమా షూటింగ్ పూర్తి చేశారు. జూలై 24న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Also read: రెమ్యూనరేషన్ డబుల్ శ్రీలీలా
Also read: సినిమా వదులుకోడానికైనా రెడీ : రష్మిక మందన్నా
Also read: ‘ENE రిపీట్’ టైటిల్ తో ఫుల్ ట్రీట్
Also read: https://in.bookmyshow.com/movies/hyderabad/hari-hara-veera-mallu/ET00308207