Pre Launch Cheating : బీకేర్ ఫుల్… ప్రీ లాంచ్ మాయలో పడొద్దు !

Blog Real Estate Top Stories

ఆ కంపెనీ దగ్గర లక్ష, రెండు లక్షలకు మించి డబ్బులు ఉండవ్… అందమైన బ్రోచర్లు, కటౌట్స్, సోషల్ మీడియాలో యాడ్స్ కోసం పెట్టేందుకు మాత్రమే ఆ డబ్బులు పనికొస్తాయి. ఇంత చిన్న పెట్టుబడితో వందల కోట్ల బిజినెస్ చేస్తున్నారు కొందరు రియల్ ఎస్టేట్ కేటుగాళ్ళు. అదెలా సాధ్యమంటే… ఆ మోసం పేరే ప్రీలాంచ్ (Real Estate pre launching). దాని మోజులో పడి మనం కష్టపడి దాచుకున్న సొమ్ములో లక్షల రూపాయలు వాళ్ళకి ధారపోస్తున్నాం. ప్లాట్స్ ఇవ్వడం ఏమో గానీ… ఈ కేటుగాళ్ళు మాత్రం రాత్రికి రాత్రే మన డబ్బుతో కోటీశ్వరులై పోతున్నారు. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రియల్ ఎస్టేట్ ప్రీలాంచ్ దందా యధేచ్ఛగా సాగిపోతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ లో దొంగలు పడ్డారు. ప్రీలాంచ్, expression of interest పేరుతో జనం సొమ్మును బహిరంగంగా దోచుకుంటున్నారు. ప్లాట్, అపార్ట్ మెంట్… మార్కెట్ ధరలో సగానికే ఇస్తామంటూ మిడిల్ క్లాస్ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఈ పనులు చేస్తోంది… చిన్నా చితకా కంపెనీలు కాదు… పెద్ద పెద్ద కంపెనీలదీ ఇదే తంతు. మొన్నటిదాకా చిట్ ఫండ్స్, ఫైనాన్స్ దందాలు నడిపిన కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ బోర్డులు పెట్టుకొని జనాన్ని దోచుకుంటున్నాయి. ఆ తర్వాత సింపుల్ గా చేతులెత్తేస్తున్నాయి. తక్కువ ధరకే ల్యాండ్ లేదంటే అపార్ట్ మెంట్ వస్తోందని ఆశపడి ప్రీలాంచ్ లో లక్షలు సమర్పించుకున్న జనం రోడ్డున పడుతున్నారు. కేసులు పెట్టుకోండి అని ఆ మోసం చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులే చెబుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి దర్జాగా బెయిల్ మీద బయటకొచ్చి మరో దందా స్టార్ట్ చేస్తున్నారు.

ఈ ప్రీలాంచ్ దందా కోసం బంజారాహిల్స్ (Banjara Hills), జూబ్లీహిల్స్ (Jubilee Hills), మాదాపూర్ (Madapur), కొండాపూర్ (Kondapur) లాంటి కాస్ట్ లీ ఏరియాల్లో ఆఫీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందమైన బ్రోచర్లు… అందులో మరింత బ్యూటీఫుల్ గా కనిపించే హైరైజ్డ్ అపార్ట్ మెంట్ లు… చుట్టూ స్విమ్మింగ్ పూల్స్, పక్కనే ఫుడ్ కోర్టు… ఆ పక్కనే దేవాలయం, మార్కెట్… అబ్బో ఒకటేంటి… ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళని ఊహల్లో తేలిపోయేలాగా మభ్యపెడుతున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు.

Read this also :Hyderabad Home Rates : ఏ ఏరియాలో ఏ రేట్లు ?

Apartments, Independent Houses పేరుతోనే కాదు… భూములు, ఫామ్ హౌస్ లు, పొలాల పేరుతో కూడా దందా నడుస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా పట్టాదారు పాస్ బుక్ ఇప్పిస్తామనీ, రైతుబంధు (Rythu Bandhu) కూడా మీ అకౌంట్ లో పడుతుందని మభ్యపెడుతున్నారు మరికొందరు కేటుగాళ్ళు. గుంట భూమికి కూడా రైతుబంధు ఎలా ఇస్తారో తెలియదు. ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయించకుండా… వ్యక్తిగతంగా Land Sale Deeds రాసిస్తున్నారు. ఎక్కడైనా భూములు అమ్మాలంటే ఆ రియల్ ఎస్టేట్ సంస్థ తప్పనిసరిగా HMDA, DTCP లే అవుట్లకు అనుమతి తీసుకోవాలి. రెరా (Rera) పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ లేకుండానే జనాన్ని మాయలో దించుతున్నారు.

Read this also : Home Loan Top up తీసుకుంటున్నారా ?

భారతీ బిల్డర్స్ చీటింగ్

రెండేళ్ళ క్రితం ప్రీలాంచ్ పేరుతో భారతీ బిల్డర్స్ జనాన్ని బురిడీ కొట్టించింది. హైదరాబాద్ కొంపల్లిలో వెంచర్ వేస్తున్నామంటూ 450 మంది నుంచి 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అందరికీ ఒకేసారి రిజిస్ట్రేషన్స్ చేస్తామంటూ మభ్యపెట్టి ఆ తర్వాత చేతులెత్తేసింది. భారతీ బిల్డర్స్ కి ఒక్కో కస్టమర్ కనీసం 40 నుంచి 50 లక్షల రూపాయల దాకా చెల్లించారు. ఆ సంస్థపై బాధితులు కేసు పెట్టి 2యేళ్ళవుతున్నా అతీ గతీ లేదు.

సాహితీ డెవలపర్స్ సంగతేంటి ?

సాహితీ డెవలపర్స్ కూడా ఇలాగే జనాన్ని ముంచింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ దగ్గర ప్రాజెక్ట్ పెడుతున్నట్టు ప్రీలాంచ్ ఆఫర్ అని వందల మందిని మోసం చేసింది. వందల కోట్లు వేసుకొని ఆ సంస్థ ప్రతినిధులు పరార్ అయ్యారు. జయత్రి సంస్థ కూడా ఇలాగే సామాన్యులకు టోపీ పెట్టింది. లేటెస్ట్ గా బిల్డాక్స్ అనే మరో సంస్థ కూడా ఇలాంటి జిమ్మిక్కులే చేసింది. హైరైజ్డ్ బిల్డింగుల పేరుతో ప్రాజెక్టు లేకుండా ప్లాట్లు అమ్మేసింది. రెరాకు కంప్లయింట్ చేయడంతో దొరికిపోయింది. హఫీజ్ పేట్ లో వివాదస్పద భూమిని చూపించి అమ్మకాలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆర్ హోమ్స్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్థ ప్రీలాంచింగ్ పేరుతో 200 మందిని ముంచి రూ.48 కోట్లు వసూలు చేసింది. నిందితులైన భార్యా భర్తలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Read this also : Hyderabad Real Estate : సిటీలో ఇల్లు కొంటారా ? మంచి ఛాన్స్ !!

Flat/House కొనాలంటే ఇవి చెక్ చేయాలి

✅. ఏదైనా సంస్థ … అది ఎంత పేరున్న బడా సంస్థ అయినా సరే… ప్రీలాంచ్ పేరుతో బుకింగ్స్ మొదలుపెడితే… ముందుగా అసలు వాళ్ళు చెబుతున్న సర్వే నెంబర్ లో భూమి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆ సంస్థ పేరున ఉందా… లేదా ఎవరైనా వ్యక్తుల పేరున ఉందా… మీకు అగ్రిమెంట్లు ఏ పేరున రాస్తున్నారో చూడాలి.

✅.మీకు అమ్మాలనుకుంటున్న ప్రాజెక్టుకు GHMC/HMDA/DTCA/RERA అప్రూవల్ ఉందా… కనీసం ఈ సంస్థలకు అప్లయ్ చేసినట్టుగా ఏవైనా డాక్యుమెంట్స్ మీకు చూపిస్తున్నారా ?
మీకు ల్యాండ్ లో 200 ప్లాట్లు, 100 ప్లాట్లు అని చూపిస్తున్నారు. కానీ అక్కడ ఉన్న భూమి చాలా తక్కువగా ఉండొచ్చు. నిజంగా మీకు చూపిస్తున్న లే అవుట్ ప్రకారం ఫిజికల్ గా అన్ని ప్లాట్స్ ఉంటాయా. అసలు ఆ కంపెనీ పేరునే ల్యాండ్ ఉందా లేదా అన్నది చెక్ చేయండి.

✅. ఏ రియల్ ఎస్టేట్ సంస్థ అయినా ఇలాంటి బిజినెస్ చేయాలంటే తప్పనిసరిగా తమ ప్రాజెక్టును రెరా ద్వారా అప్రూవల్ చేయించుకోవాలి. రెరాలో నమోదు అయిందా… లేకుందానే అమ్ముతున్నారా… రెరా అధికారులను సంప్రదించాలి.

✅. కోటి రూపాయల బిల్డింగ్ కి ముందుగా 50 లక్షలు చెల్లిస్తే మీ సొంతమవుతుంది అని చెబుతుంటారు. కానీ నిజంగా మీరు 100శాతం డబ్బులు చెల్లించాక… ఏదైనా సమస్యలతో ఆ ప్రాజెక్టు ఆగిపోతే పరిస్థితి ఏంటి ? ఎవరు గ్యారంటీగా ఉంటారు… అలాంటి కండీషన్స్ ఏవైనా మీ అగ్రిమెంట్ లో రాస్తున్నారా ?

✅. ఈమధ్య చెరువుల బఫర్ జోన్స్ పరిధిలో ఉంటే… హైదరాబాద్ పరిధిలో హైడ్రా అధికారులు వాటిని కూలగొడుతున్నారు. మీరు తీసుకునే ఫ్లాట్ లేదా ఇల్లు హైడ్రా పరిధిలోకి వస్తుందా… లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి.

✅రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈసీ తీసుకోవడం… భూమి ఉందో లేదో తెలుసుకోవడం… రెరా, HMDA, DTCA, GHMC పర్మిషన్లు చెక్ చేసుకోవడం లాంటివి ఏవీ చేయకుండా … పైసా కూడా అడ్వాన్స్ వాళ్ళకి చెల్లించవద్దు

ఇలాంటి మంచి కథనాలు అందిస్తున్న తెలుగు వర్డ్ వెబ్ సైట్ Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Click here : Telugu Word Telegram Link

Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *