సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’కు బ్రేక్

ET World Latest Posts Trending Now

సిరీస్ అటకెక్కినట్లే

స్టార్ బ్యూటీ సమంతపై ఆడియన్స్ లో అప్పుడూ ఇప్పుుడు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌లను కూడా ప్లాన్ చేస్తోంది. 2023 లో ‘విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి తర్వాత, మే 9 న ‘శుభం’ అనే హర్రర్ కామెడీతో నిర్మాతగా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ మూవీలో స్పెషల్ రోల్ కూడా చేసింది. మరో వైపు హిందీలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సమంత, గత ఏడాది నవంబర్ 6 న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది.

ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే మరో హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. యాక్షన్ ఫాంటసీ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ క్రేజీ హీరో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. ‘సిటాడెల్’ ని తెరకెక్కించిన రాజ్ & డికె, ప్రముఖ ఓటిటి సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. అయితే, ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌కు ముందే దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ఫ్రాడ్ జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. ఇక రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ మేకర్స్‌తో చర్చలు జరిపిందట. ‘తుంబాడ్’ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ‘రాహి అనిల్ బర్వే ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే, ఇప్పట్లో ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కడం కష్టంగా తెలుస్తోంది. దీంతో ఈ వెబ్ సిరీస్‌ అటకెక్కినట్లే అని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. రక్త్ బ్రహ్మాండ్ ఆగిపోయిందనే టాక్ రావడంతో సమంత సినీ కెరీర్ పై రకరకాల వార్తలు వినపిస్తున్నాయి. సమంత చాలా రోజుల క్రితమే ‘మా ఇంటి బంగారం’ అనే మూవీని అనౌన్స్ చేసింది. కానీ ఇంతవరకు ఆ సినిమా స్టార్ట్ కాలేదు. ఇవి తప్పితే సమంతా చేతిలో వేరే ప్రాజెక్టులు లేవు. ప్రస్తుతం డైరెక్టర్లు ఆమెకు ఛాన్సులు ఇస్తారా లేదాన్నది సస్పెన్స్ గా మారింది.

Also read: ‘కన్నప్ప’ బుకింగ్స్ కు సాలిడ్ రెస్పాన్స్

Also read: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో చాబహార్ పోర్ట్ పై ఎఫెక్ట్

Also read: కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ సీటుపై లొల్లి

Also read: https://www.sakshi.com/telugu-news/movies/samantha-web-series-rakt-brahmand-shelved-2487016

Tagged

Leave a Reply