నేషనల్ క్రష్ రష్మిక వరసబెట్టి సక్సెస్‌లతో దూసుకుపోతోంది. రష్మిక నటించిన సినిమాలిప్పుడు వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన కుబేర సినిమా రూ వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఇప్పుడు రష్మిక కొత్త ప్రాజెక్ట్ డీటైల్స్ కొన్ని బయటకు వచ్చాయి. లేటేస్ట్ గా రష్మిక లేడీ ఓరియెంటెడ్ గా ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతోంది. ఈ సినిమాలో యోధురాలిగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేస్తూ ఒక్కసారిగా ఈ మూవీ యూనిట్ అంచనాలు పెంచేసింది.
ఆ లుక్ లో చుట్టూ ఉన్న వాతావరణం, ఎదురుగా వస్తున్న శత్రువులు, చేతిలో ఉన్న ఆ ఆయుధం ఇవన్నీ చూస్తుంటే రష్మిక ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చేయబోతోన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రష్మిక తన ఫాన్య్ ను ఓ సవాల్ విసిరారు. ఈ సినిమా టైటిట్ ను గెస్ చేయాలని ఫ్యాన్స్ ను కోరారు. టైటిల్‌ను సరిగ్గా చెప్పిన వారిని తానే స్వయంగా వచ్చి కలుస్తానని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటైల్స్ మేకర్ 27వ తేదీని వెల్లడించనున్నట్లు తెలిపారు.
Also read: జాడ లేని ఇరాన్ సుప్రీం లీడర్
Also read: చైనా, పాకిస్తాన్ కు భారత్ ఝలక్
Also read: చైనా, పాకిస్తాన్ కు భారత్ ఝలక్