టాలీవుడ్‌కి నటిగా పరిచయమైన రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్‌తో వివాహం తరువాత సినిమాలకు దూరమైంది. ‘బద్రి’ సినిమాతో దక్షిణాదిలోకి అడుగుపెట్టిన రేణూ, కొద్ది సినిమాల తరువాత సినీ రంగానికి గుడ్‌బై చెప్పింది. విడాకుల తరువాత పిల్లల పెంపకంతో బిజీగా ఉండే రేణూ, కొంత సమయం దొరికితే సినిమాలు డైరెక్ట్ చేయడం మొదలు పెట్టింది.
ఇటీవల రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో కనిపించి అలరించినా, సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మళ్లీ వెండితెరపై కనిపించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్, సమాజంపై తన బాధ్యతను ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇటీవల కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి, అనంతరం మన బలగాల ‘ఆపరేషన్ సిందూర్’, తదనంతర భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాలు పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించడంతో, భారతీయుల్లో ఆగ్రహం వెల్లివిరుస్తోంది. టర్కీ వంటి దేశాల్లోకి వెళ్లే పర్యాటకులు తమ ట్రిప్స్ రద్దు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రేణూ దేశాయ్ అందరికీ ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ చేసే చిన్న చర్యలు కూడా ఎంతో ప్రాముఖ్యమన్నారు. “ఇప్పటివరకు నేను చైనా ఉత్పత్తుల్ని బాగా కొనుగోలు చేశాను. కానీ ఇకపై ప్రతి వస్తువు కొనేముందు దాని లేబుల్‌ను చూసి, చైనాలో తయారై ఉంటే నిషేధిస్తాను. ఇది చిన్న పని కావచ్చు కానీ ఎక్కడో ఒకచోట మొదలవాలి. మనం చేసే ప్రతి ఎంపిక దేశానికి మద్దతుగా ఉండాలి,” అంటూ రేణూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read This Also : లాక్ చేసిన ‘కింగ్ డమ్’ యూనిట్… సెట్స్ నుంచి ఆసక్తికరమైన ఫోటో విడుదల
Read This Also : జైలర్-2లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య?
Read This Also : “ఆర్ఆర్ఆర్ 2 వస్తుందా?” రాజమౌళి సమాధానం ఏమిటి?