శారీరకంగా (physical health), మానసికంగా (mental health) ఆరోగ్యంగా ఉండేందుకు Yoga, Mindfulness Meditation ఎంతగానో సహాయపడతాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశంపై Harvard Medical School నిర్వహించిన పరిశోధనల్లో Isha foundation వ్యవస్థాపకులు Sadhguru రూపొందించిన ప్రత్యేక ధ్యాన పద్ధతి మెదడు వృద్ధాప్యాన్ని తగ్గిస్తోందని తేలింది.
Isha Foundation అభివృద్ధి చేసిన ‘Samyama Meditation’ పై Harvard లో అధ్యయనం
Massachusetts General Hospital, Beth Israel Deaconess Medical Center లోని నిపుణులు హార్వర్డ్ మెడికల్ స్కూల్ సహకారంతో Samyama Meditation Benefitsపై అధ్యయనం చేశారు. ఈ ధ్యానం కోసం 8 రోజుల పాటు నిశ్శబ్దంలో గడిపిన ధ్యానులను పరిశీలించారు.
వీరు నిర్వహించిన మెదడు స్కానింగ్ ప్రకారం, ఈ ధ్యానం చేసిన వారి మెదడు వయస్సు కంటే సగటున 5.9 సంవత్సరాలు చిన్నగా కనిపించింది, అంటే మెదడు వృద్ధాప్యం ఆలస్యం అవుతోంది. కొంతమందిలో ఇది 10 సంవత్సరాల వెనక్కి వెళ్లిందని గుర్తించారు!
Brain Healthకి ధ్యానం ఎలా సహాయపడుతుంది?
EEG స్కానింగ్ ద్వారా మెదడు యాక్టివిటీ పరిశీలించారు. Cognitive Function, Memory Power మెరుగుపడినట్టు స్పష్టంగా తేలింది. Better Sleep, Focus Improvement వంటి అనేక లక్షణాలు సంయమ సాధన చేసినవారిలో కనిపించాయి. ధ్యానానికి ముందు-తర్వాత వారి ఆలోచనా శక్తిలో మెరుగుదల ఉందని గుర్తించారు.
హార్వర్డ్‌కు చెందిన Dr. Bala Subramaniam నేతృత్వంలో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రముఖ Mindfulness Journal లో ప్రచురించారు.
Samyama Meditation అంటే ఏమిటి?
- ఇది ఒక intensive 8-day [Silent Meditation Retreat].
- ముందు నుండి నెలలపాటు Daily Yoga Practice, Vegan Diet, Shambhavi Mahamudra Kriya, Shakti Chalana Kriya, Shoonya Meditation, Hatha Yoga లాంటి పద్ధతులను పాటించాలి.
- దీన్ని పూర్తిగా సద్గురు రూపొందించారు మరియు ఇది Isha Yogaలో అత్యంత గౌరవనీయమైన సాధన.
ఇది ఒక సైన్స్‌తో నిండిన అద్భుతం – Sadhguru
సాధనల శక్తిని ఆధునిక సైన్స్ గుర్తించినప్పటికీ, మన శరీరం, మెదడుపై ధ్యానం చేసే ప్రభావాన్ని నిత్యం మనమే చూసుకోవాలి అని సద్గురు వ్యాఖ్యానించారు. “ప్రతి ఒక్కరూ తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టాలి. దీని ఫలితాలు మన భవిష్యత్తు తరాలకు కూడా ప్రయోజనకరం” అని అన్నారు.
Read also : 40 యేళ్ళు దాటాయా ? మీరేం చేయాలంటే !
Read also : ఐటీ పీపుల్ కి ఫ్యాటీ లివర్ !
Join our Telegram Channel : CLICK HERE
Join our What’s app Group : CLICK HERE