అయ్య బాబోయ్..
భూకంపం అంటేనే గజగజా వణికిపోతాం. వరుసగా ఒకటి, రెండు సార్లు ఇలా జరిగితే అయ్య బాబోయ్ అని భయపడతాం. అంతేకదా. మరి జపాన్ లోని టొకారా దీవుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ వింటే రియాక్ట్ అయ్యేందుకు మాటలు కూడా రావు. ఇంతకీ మ్యాటరేంటంటే.. అక్కడ లాస్ట్ 2 వీక్స్ లో ఏకంగా 900 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. జూన్ 21 నుంచి ఇలా జరుగుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందుగా సునామీ హెచ్చరికలు ఇష్యూ చేసినప్పటికీ.. తర్వాత విరమించుకున్నారు. మరీ ఎమర్జెన్సీ అయితే స్థానికులను అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
టొకారా దీవుల్లో జనాభా తక్కువ. ఇళ్లు కూడా ఎక్కువేం ఉండవు. దీంతో, ఎప్పుడైనా కానీ వారిని వేరే ప్రాంతాలకు షిప్ట్ చేసేందుకు ఈజీగా వీలవుతుంది. జపాన్ వాతావరణ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. గత నెల 23న ఒక్కరోజులోనే 180 సార్లకు పైగా భూమి కంపించిందన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఇలాగే జరిగింది. సుమారు 350 సార్లు ఎర్త్ క్వేక్ సంభవించింది. టొకారా మొత్తం 12 దీవుల సముదాయం. వాటిలో 7 చోట్ల జనం ఉన్నారు. వారి సంఖ్య 700. భూకంప తీవ్రత ఎక్కువైతే వారిని షిప్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also read: ఖర్గే టూర్ పై కాంగ్రెస్ నేతల్లో టెన్షన్
Also read: రేపు మెగా సునామీ?