తిన్న తర్వాత కనీసం వంద అడుగులు అయినా వేయాలని మన పెద్దలు చెబుతుంటారు. పల్లెల్లో గతంలో చాలామంది తినగానే కాస్తంత సెంటర్ దాకా వెళ్ళి వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది ఇలా తిన్న తర్వాత నడుద్దామా అంటే లైట్ తీసుకుంటారు. కానీ పగలు, రాత్రి ఎప్పుడు భోజనం చేసినా… కాస్తంత నడిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అని చెబుతున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు. భోజనం తర్వాత పడుకున్నామంటే కునుకు పట్టేస్తుంది. కానీ నడక అలవాటు చేసుకోవడం వల్ల రోజంతా చురుగ్గా ఉండొచ్చు. ఆరోగ్యకరంగా ఉండొచ్చు.
తిన్న తర్వాత వాకింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం !
Read this also : కీర గురించి తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు !
తిన్న ఆహారం తేలికగా జీర్ణం
తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. అంటే చిన్నపాటి నడక వల్ల మన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. పేగుల్లో ఆహారం సాఫీగా కదలడానికి సహకరిస్తుంది. దానివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు తలెత్తవు. శరీరం కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. ఆహారం మంచిగా అరగాలంటే తిన్న తర్వాత ఖచ్చితంగా నడవాల్సిందే.
అదుపులో గ్లూకోజ్ లెవల్స్
మనం తిన్న ఆహారంలో కార్బొహైడ్రేట్ల వల్ల తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల తిన్నాక కొద్దిసేపు నడిస్తే కండరాలు ఆహారంలోని గ్లూకోజ్ ని వాడుకుంటాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా కంట్రోల్ లో ఉంటాయి.
Read this also : ఆరోగ్యానికి చుక్క కూర బెస్ట్
క్యాలరీలు కరుగుతాయి
తిన్నాక 10 నుంచి 20 నిమిషాలు సేపు నడిస్తే… శరీరంలో కొన్ని క్యాలరీలు కరుగుతాయి. అలా తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల ఒబెసిటీ ప్రాబ్లెమ్ ఉండదు.
సుఖమైన నిద్ర
రాత్రి పూట తిన్న తర్వాత నడవడం వల్ల నిద్రలో నాణ్యత కూడా పెరుగుతుంది. రాత్రి నిద్రకు ముందు అతిగా వ్యాయామాలు చేయడం కరెక్ట్ కాదు. కానీ నడవడం వల్ల ఒత్తిడిని తగ్గించే హార్మోన్లయిన కార్టిసోల్, ఎండార్ఫిన్ల విడుదలవుతాయి. దాంతో శరీరం విశ్రాంతి స్థితికి వస్తుంది. బయట తాజా గాలి పీల్చడం వల్ల శరీరం, మనసు కాస్త ఉపశమనం పొందుతాయి. రాత్రిళ్ళు సుఖమైన నిద్ర పడుతుంది.
గుండెకు మంచి ఆరోగ్యం
జనరల్ ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. తిన్న తర్వాత ఇంకా మంచిది. రక్తం సాఫీగా సరఫరా అవడానికి నడక మంచిది బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా దోహదపడుతుంది.
మెదడు చురుకుగా…
తిన్న తర్వాత కొంత దూరం నడవటం వల్ల మన మెదడు చురుకగా పనిచేస్తుంది. పదునైన ఆలోచనలు వస్తాయి. చాలా మందికి వాకింగ్ చేస్తూ ఆలోచించుకోవడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికిందని చెబుతారు.
2014లో ‘జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో పబ్లిష్ అయిన నివేదిక ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిచినప్పుడు వారి జీర్ణక్రియ రేటు బాగా పెరిగిందనీ….. జీర్ణ అసౌకర్యం, ఉబ్బరం, కడుపు నొప్పి లాంటి లక్షణాలు తగ్గాయని తేలింది. ఈ పరిశోధనలో న్యూజిలాండ్‌లోని ఒటాగో యూనివర్సిటీలో పనిచేసే ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ M.J. శాండ్స్ పాల్గొన్నారు. తిన్నాక నడవడం వల్ల కడుపు, ప్రేగుల ఆరోగ్యానికి చాలా మంచిదని, జీర్ణ సమస్యలు తగ్గుతాయని ఆయన నివేదికలో తెలిపారు.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK