కూకట్ పల్లి పీఎస్ లో కంప్లయింట్

Latest Posts Trending Now

పాలు విరిగిపోయినయ్ !

హైదరాబాద్  కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఓ రేర్ కేసు నమోదైంది. పాలు విరిగిపోయాయంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం చర్చకు దారితీసింది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఓ వ్యక్తి రెండు హెరిటేజ్ మిల్క్ ప్యాకెట్లు కొన్నాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి కాచిన తర్వాత ఒక ప్యాకెట్ లో పాలు బాగానే ఉండగా.. మరో ప్యాకెట్ లోని పాలు విరిగిపోయాయి. దీంతో ఆ వ్యక్తి తను మిల్క్ ప్యాకెట్ కొన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ కు వెళ్లి విషయం చెప్పాడు.

దీంతో తమకు సంబంధం లేదంటూ వాళ్లు ఆన్సరిచ్చారు. దీంతో ఆవ్యక్తి కోపంతో తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. పోలీసులు కూడా చేసేదేం లేక కేసు నమోదు చేసుకున్నారు. ఈమధ్య కాలంలో ప్యాకెట్ పాలపై ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. కానీ చాలామంది కిమ్మనకుండా ఊరుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం కంప్లైంట్ చేశాడు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కస్టమర్లు అంటున్నారు. లేకపోతే ఇతనిలాగే చాలామంది పోలీస్ స్టేషన్ కొచ్చే అవకాశం ఉంటుంది.

Also read: వామ్మో.. ఇన్ని లోపాలా?

Also read: అమ్మ ఆరోగ్యం బావుంది: నాగబాబు

Also read: తిరుమలలో లడ్డూ టోకెన్లకు కియాస్కులు

Also read: https://ntvtelugu.com/telangana-news/spoiled-milk-packet-case-kukatpally-police-818219.html

Tagged

Leave a Reply