రెమ్యూనరేషన్ డబుల్ శ్రీలీలా

ET World Latest Posts Trending Now

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళుతోంది. ఈ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టిందే మొదలు సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన టాలెంట్ , డ్యాన్స్ మూమెంట్స్ తో తెలుగు ఆడియన్స్ కు కట్టిపడేసింది. ఇదే స్పీడుతో చేతినిండా అవకాశాలు అందుకుంటుంది. స్టార్ హీరోయిన్ గా మారిన శ్రీలీల .. తను తీసుకు్న రెమ్యూనరేషన్ ఎంతనేది హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజ రవితేజ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఫిలిం ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉంది.

దీంతో శ్రీలీలా కూడా తన రెమ్యూనరేషన్ను భారీగా పెంచేసిందట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. గతంలో 3.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు తీసుకునే ఈ చిన్నది.. ఇప్పుడు రేటు అమాంతం పెంచేసింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది శ్రీలీల. ఆ సినిమా వచ్చి 6 ఏళ్లు దాటి పోయింది. మరి ఆమాత్రం డిమాండ్ చేయదా అంటున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్. ఎంత పెంచినా ఈ యంగ్ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ తన హవా కంటిన్యూ చేస్తోంది.

Also read: సినిమా వదులుకోడానికైనా రెడీ : రష్మిక మందన్నా

Also read: ‘ENE రిపీట్’ టైటిల్ తో ఫుల్ ట్రీట్

Also read: సమంత, రకుల్ కి నోటీసులిస్తారా ?

Also read: https://telugu.filmibeat.com/gossips/tollywood-actress-sreeleela-hikes-her-remuneration-its-double-now-158081.html

Tagged

Leave a Reply