Telugu Word

Year End Sales : అద్దిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు

2024 ఏడాది చివర్లో మొబైల్ ప్రియులకు పండగ. AI ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు ఈ డిసెంబర్ నెలలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. Mobile manufacturing కంపెనీలు జనరల్ ఏడాదంతా స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేస్తుంటాయి. ఏడాది చివరల్లో అంతగా ఆసక్తి చూపించవు. కానీ ఈసారి డిఫరెంట్ గా AI తో పాటు అనేక new features తో మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. IQOO, Red Mi, Vivo Mobiles ఈ year end లో రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

ONE PLUS + 13 Series

One Plus 13

One Plus 13, One Plus 13R మొబైన్లు కూడా ఈ నెలలోనే రిలీజ్ అవబోతున్నాయి. Oneplus13 Snap dragon 8 ప్రాసెసర్‌తో వస్తోంది. 13R Snapdragon 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌తో Release చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు కానీ Oneplus website లో మాత్రం NOTIFY ME అని చూపిస్తోంది. కొత్త ఏడాదిలోపే వీటిని మార్కెట్లోకి తీసుకొస్తారని టాక్ నడుస్తోంది.

IQOO 13

Iqoo 13 Smart mobile డిసెంబర్‌ 3న ఇండియన్ మార్కెట్‌లోకి రిలీజ్ అవుతోంది. రేటు ఎంతో ఇంకా బయటపెట్టలేదు. కానీ Snap dragon 8 Elite, Flagship ప్రాసెసర్‌తో వస్తోంది. ఇందులో 6150 MAh బ్యాటరీ హైలెట్ గా ఉండబోతోంది. 50MP Triple cameraతో వస్తోంది IQOO 13 మొబైల్.

You can buy with this Link: https://amzn.to/4eVGM8f

VIVO X200 Series

చైనాకు చెందిన వివో బ్రాండ్‌ కి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తుండటంతో యూత్ VIVO మొబైల్ కి ఫిదా అవుతున్నారు. ఈసారి VIVO X సిరీస్‌లో కెమెరా సెంట్రిక్‌ ఫోన్లను తీసుకొస్తోంది. X200, X200 ప్రోను రిలీజ్ చేయబోతోంది. VIVO కూడా ఇంకా Official Date release చేయలేదు. కానీ ఈ డిసెంబర్ లో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందని మార్కెట్ల వర్గాలు చెబుతున్నాయి.

Red Mi Note 14 Series

Redmi Note seriesను షావోమీ కంపెనీ ఈనెల 9న లాంచ్‌ చేయడానికి ప్లాన్ చేస్తోంది. డేట్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసింది. Redmi Note14, Redmi Note14Pro, Redmi Note14 Pro plus పేరుతో మొత్తం 3 ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. Redmi Phoneలు రూ.35,000 వరకూ ఉండ వచ్చని అంచనా వేస్తున్నారు. Mobile specifications మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు.

ఇలాంటి మంచి కథనాలు అందిస్తున్న తెలుగు వర్డ్ వెబ్ సైట్ Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Click here : Telugu Word Telegram Link

Exit mobile version