Telugu Word

Sabarimala ఆలయం తెరిచారు ! Rail Timings ఎప్పుడంటే !

కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. నవంబర్ 16 తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలు మొదలయ్యాయి. మొదటి రోజు వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల కోసం 2025లో మండల- మకరవిళక్కు సీజన్ కల్లా రోప్ వే సేవలు అందుబాటులోకి తెస్తోంది కేరళ ప్రభుత్వం.

India trains

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపుతోంది సికింద్రాబాద్ మౌలాలీ నుంచి కొల్లం స్టేషన్ దాకా నవంబరు 22, 29 తేదీల్లో రెండు రైళ్ళు (Train No. 07143) బయల్దేరుతాయి. తిరుగు ప్రయాణం కొల్లం నుంచి మౌలాలికి నవంబరు 24, డిసెంబరు 1నాడు రైళ్లు (Train No. 07144) ఉంటాయి. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం మీదుగా ఈ రైళ్ళు వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం నుంచి కొల్లంకు (Train No.07145) నవంబరు 18, 25 తేదీల్లో వెళ్తుంది. అలాగే కొల్లం నుంచి మచిలీపట్నంకు (Training No.07146) నవంబరు 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.

అయ్యప్ప స్వామి AI Chat Bot

శబరిమలలో అత్యాధునిక Digital Assistant ‘Swami AI Chat Bot ను ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులకు information తో పాటు వాటి డౌట్స్ తీరుస్తుంది. అయ్యప్ప స్వామి ఆలయం తెరిచే వేళలు, పూజా సమయాలు, ప్రసాదం లాంటి సమాచారాన్ని English, Hindi, Malayalam, Telugu, Tamil, Kannada భాషల్లో ఈ Swami AI Chat Bot సమాచారం అందిస్తుంది. దగ్గర్లో ఉన్న దేవాలయాలు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్ ల వివరాలు కూడా తెలియజేస్తుంది.

ఈ లింక్ ద్వారా Telugu Word website Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి : CLICK HERE

Exit mobile version