Telugu Word

జనవరి 29న మౌనీ అమావాస్య… ఏం చేయాలి ?

జనవరి 29 (బుధవారం) నాడు పుష్య అమావాస్య ఉంది. దీన్నే మౌని అమావాస్య అంటారు. ఈ రోజుతో పుష్య మాసం ముగిసిపోతుంది. ఈ రోజున రెండో మహా కుంభ అమృత స్నానం చేస్తారు. అందుకే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.

Vishnu Laxmi devi

Read this also : శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి ?

మౌనీ అమావాస్య ప్రత్యేకత ఏంటి ?

హిందూ సంప్రదాయంలో ప్రతి అమావాస్యకీ ప్రాధాన్యత ఉంది. ఆ రోజున విష్ణుమూర్తి, సూర్య భగవానులకు పూజ చేస్తారు. అయితే ఈ పుష్య అమావాస్య (మౌని అమావాస్య)కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మిదేవిని పూజించడం, పవిత్ర స్నానం చేయడంతో పాటు, పూర్వీకులకు తర్పణాలు, పిండప్రదానాలు చేస్తారు. మౌనీ అమావాస్య రోజున పిండ ప్రదానం, తర్పణం చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. కొందరు ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. మౌని అమావాస్య ఉపవాసం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని శాస్త్రాల్లో కూడా చెప్పారు.

మౌనీ అమావాస్య రోజు ఏం చేయాలి ?

ఈ రోజు..తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే గంగా మాతను సూర్య భగవానుడిని కూడా ఆరాధిస్తే మంచిది. ఈ రోజు మౌనవ్రతం పాటించాలి. ఈ వ్రతం పాటించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే శాఖహారమే తీసుకోవాలి. రాగి గిన్నెలో స్వచ్ఛమైన నీరు, ఎర్ర చందనం, ఎర్రటి పూలు వేసి.. ఆ నీటిని సూర్యుడికి సమర్పించాలి. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉపవాసం ఉండి దానధర్మాలు చేయాలి. తులసి మొక్కను పూజించి, తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల పితృ దేవతల దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి.

గంగమ్మ భూమికి వచ్చే రోజు ఇదే !

పురాణ కథనాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి అమృతంగా మారి ఆకాశం నుంచి కిందికి దిగి వస్తుంది. అందుకే ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే పరమ పుణ్యమని పెద్దలు చెబుతారు. పుష్య అమావాస్య రోజున చేసే మంచి కార్యాలు గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ అమావాస్యను లఘు పితృపక్షం అంటారు. ఈ రోజున భగవద్గీతను చదువుకోవాలి. అలాగే రావిచెట్టుకు నీరు పోసి, దాని దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేస్తే పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

‘ఓం ప్రీత్ దేవతయే నమః’ అని జపం చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Exit mobile version