శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం (జూన్ 2న) ఉదయం 7:02 నుండి 7:20 గంటల మధ్య మిథున లగ్నంలో ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. తర్వాత స్వామి వారి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముందు స్వామివారు ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలతో కలిసి బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఇది […]
Continue Reading