Usha chilukuri : యూఎస్ సెకండ్ లేడీ మన తెలుగమ్మాయే ! US Vice president ఆంధ్ర అల్లుడు !!

Blog Latest Posts NRI Times Top Stories Trending Now

అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టబోతున్నారు. US Vice president గా JD Vance వ్యవహరిస్తారు. వాన్స్ పెళ్ళి చేసుకుంది తెలుగమ్మాయినే. ఆమె పేరు ఉష చిలుకూరి (Usha Chilukuri vance). ఆమె అమెరికాకు సెకండ్ లేడీగా ఉంటారు. ఒహాయో రాష్ట్ర సెనేటర్ గా ఉన్న జేడీ వాన్స్ ట్రంప్ తన ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. దాంతో రెండు నెలల క్రితమే ఉష చిలుకూరి గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెర్చ్ చేశారు.

ఉషా చిలుకూరి అమెరికాలోనే పుట్టి పెరిగారు. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రుకు దగ్గర్లోని గ్రామం. 1980లోనే ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి వలస వెళ్ళారు. వీళ్ళకి ముగ్గురు సంతానం. అందులో ఉష ఒకరు. తల్లి లక్ష్మి మాలిక్యుర్ బయాలజీలో ప్రొఫెసర్. ప్రస్తుతం శాన్ డియాగో యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. తండ్రి రాధాకృష్ణ ఏరో స్పేస్ ఇంజినీర్. అనేక కీలకపదవుల్లో పనిచేశారు.

ఉష న్యాయశాస్త్రంలో జెమ్

ఉషా చిలుకూరి యేల్‌ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్‌ డిగ్రీ చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో మాస్టర్స్ చదివారు. ఆమె లాకి సంబంధించిన విభాగాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. యేల్‌ యూనివర్సిటీ లా అండ్‌ టెక్‌ జర్నల్‌కు మేనేజింగ్‌ ఎడిటర్‌గా కూడా పనిచేశారు. నాలుగేళ్ల పాటు ఆ యూనివర్సిటీలో అనేక కార్యక్రమాల్లో ఉషా పాల్గొన్నారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్ళారు.

వాన్స్ తో ఉష లవ్… హిందూ సంప్రదాయంలో పెళ్ళి

యేల్‌ లా స్కూల్‌లోనే ఉన్నప్పుడే ఉషా, జె.డి.వాన్స్‌ కి పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 2014లో కెంటకీలో ఇద్దరికీ హిందూ సంప్రదాయంలో మ్యారేజ్ జరిగింది. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. భర్త విజయంలో ఉషదే కీ రోల్. పొలిటికల్ అడ్వైజర్ గా వాన్స్ ను నడిపించింది ఉష. ఒహాయో సెనేటర్‌గా నిలబడినప్పుడే ప్రచారంలో ఉష కీలకంగా వ్యవహరించారు. తనను అడుగడుగునా ప్రోత్సహించే భార్య దొరికిందని ఓ పాడ్ కాస్ట్ లో వాన్స్ చెప్పాడంటే, భార్య ఉష ఎంత కీలకమో అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత జరిగిన మీటింగ్ లో కూడా వాన్స్ పక్కనే ఉష కనిపించింది.

Tagged