ఇండియాలోకి చైనా వైరస్

Healthy Life Latest Posts Top Stories Trending Now

చైనాలో మొదలైన కొత్త వైరస్… ఇండియాలో ప్రకంపనలు రేపుతోంది. బెంగళూరులో ముగ్గురు చిన్నారులకు HMPV నిర్ధారణ అయింది. కర్ణాటకలో రెండు, గుజరాత్ లో ఒక Human metapneumovirus (HMPV) కేసులను ICMR గుర్తించింది. ప్రస్తుతం బెంగళూరు, అహ్మదాబాద్ లో చిన్నారుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. భారత్ లోకి HMPV రావడంతో జనం అప్రమత్తం అవుతున్నారు.

Human metapneumovirus

Human metapneumovirus ప్రభావం ఎక్కువగా వృద్ధులు, చిన్నారుల్లో ఉంటుందని చెబుతున్నారు. ఇనెఫెక్షన్ల తాకిడికి చైనాలో హాస్పిటల్స్ లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మరీ గతంలో కోవిడ్ 19 తరహాలో Lock Down పరిస్థితులు ఏమీ లేవని అక్కడి భారతీయులు Social media లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అందువల్ల పెద్దగా భయపడాల్సిన పరిస్థితి లేదు.  అయితే చైనాలో డిసెంబర్ 16 నుంచి 22 మధ్య కాలంలో శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. ఇన్ ఫ్లు యెంజా ఎ, మైకో ప్లాస్మా నిమోనియై, కోవిడ్ 19 వైరస్ లు కూడా వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది.  మరీ ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికీ… కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Human metapneumovirus

HMPV లక్షణాలు ఏంటి ?

👉 దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి.

👉 వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవాళ్ళల్లో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీస్తాయి.

👉ఇన్ ఫెక్షన్ సోకిన 3 నుంచి 6 రోజుల్లోపు ఈ లక్షణాలు బయటపడతాయి.

👉 శ్వాశ కోశ ఇన్ ఫెక్షన్ వల్ల నిమోనియా, ఆస్తమా తీవ్రం అవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

👉 చిన్నారులు, వృద్ధులతో పాటు… రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యం కలిగిస్తుంది.

 

HMPV ఎలా వ్యాపిస్తుంది ?

👉 దగ్గు, తుమ్ము వల్ల బయటకు వచ్చే తుంపర్ల ద్వారా

👉 వైరస్ బారిన పడిన వారితో సన్నిహితంగా మెలగడం, వాళ్ళతో shake hands ఇవ్వడం లాంటి చర్యలు

👉 వైరస్ వ్యాపించిన ప్రాంతాను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్ళను తాకితే వైరస్ వ్యాపించే అవకాశం ఉంది

Human metapneumovirus

మనం ఏం చేయాలి ?

👉 Covid 19 వ్యాపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాగే చేయాలి.

👉తరుచుగా సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు చేతులు కడుక్కోవాలి. లేదా శానిటైజర్ వాడాలి

👉శుభ్రం చేసుకోని చేతులతో కళ్ళు, ముక్కు, నోటి దగ్గర టచ్ చేయరాదు

👉ఇన్ ఫెక్షన్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.

👉జలుబు లక్షణాలు ఉన్నవాళ్ళ తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలి. అలాగే దగ్గు, తుమ్ము వస్తే… నోరు లేదా ముక్కును కవర్ చేసుకోవాలి.

👉వైరస్ తో బాధపడేవారు బయటి ప్రాంతాల్లో తిరగరాదు.

ఈ ఆర్టికల్ చదవండి https://www.lung.org/lung-health-diseases/lung-disease-lookup/human-metapneumovirus-hmpv

 

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న Telugu Word – Telegram group లో జాయిన్ అవ్వండి

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Tagged

1 thought on “ఇండియాలోకి చైనా వైరస్

Comments are closed.