ఒకప్పుడు స్వాతంత్య్రం తెచ్చిపెట్టామన్న కృతజ్ఞత కూడా లేకుండా పోతోంది బంగ్లాదేశ్ లో. షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయినప్పటి నుంచి ఆ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోతోంది. పాకిస్థాన్ (Pakistan)లో లాగే బంగ్లాదేశ్ (Bangladesh) లోనూ హిందువులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది. ఈ దారుణాలను ప్రశ్నించినందుకు చిన్మయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishnadas) ను అరెస్ట్ చేయడమే కాదు… ఇప్పుడు ఇస్కాన్ ను బహిష్కరించే దిశగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
బంగ్లాదేశ్ 17 కోట్ల జనాభాలో 8శాతం మంది హిందువులు (Hindus) ఉన్నారు. గత ఆగస్టులో షేక్ హసీనా (Shaik Hasina) ప్రభుత్వం కూలిపోయాక 50 జిల్లాల్లో హిందూ మైనార్టీలపై దాడులు జరిగాయి. దేవాలయాలను కూలగొట్టారు. సంపద దోచుకున్నారు. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్ళల్లో హిందూ ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఇప్పుడు అది చాలక అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ISKCON) మాజీ సభ్యుడైన సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ ను నిరసిస్తూ మైనార్టీ హిందువులు భారీ ఎత్తున ఢాకాలో నిరసన తెలిపారు. చిట్టోగ్రామ్ లో జరిగిన ఘర్షణల్లో 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులకే కాదు… బుద్ధులకు (Buddists) కూడా ప్లేస్ లేకుండా పోతోంది. కృష్ణదాస్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారనీ, ఆయన్ని విడుదల చేయాలని బౌద్ధ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ (Hindu Buddist Christian unity council) ఏకమై బంగ్లాదేశ్ లో మైనార్టీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇస్కాన్ (ISKCON) పై నిషేధం ?
బంగ్లాదేశ్ లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ISKCON) పై నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ సంస్థను నిషేధించాలని ఇప్పటి బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు కొందరు అతివాద ముస్లిం నేతలు. దీనిపై స్పందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇస్కాన్ మత సంస్థే అని ప్రభుత్వ అటార్నీ జనరల్ పిటిషనర్లకు వత్తాసు పలికారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇస్కాన్ పై బ్యాన్ విషయంలో సానుకూలంగా ఉండటంతో ఇక ఆ సంస్థపై రేపో, మాపో నిషేధం పడే అవకాశాలున్నాయి.
Read also : Bangladesh : పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్… ఇస్లాం రాజ్యం అవుతుందా?
ఇస్లాం రాజ్యమైతే హక్కులు ఉండవా ?
ఇస్లాం రాజ్యంగా బంగ్లాదేశ్ మారిపోతోంది. మెజారిటీ వర్గం ముస్లింలు కాబట్టి అలాంటి మార్పు సహజం. కానీ ఇస్లాం రాజ్యంలో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులకు హక్కులు ఉండకూడదు అనడమే దారుణం. దక్షిణాసియాలో, పశ్చిమాసియాలో ఎన్నో ముస్లిం దేశాల్లో హిందువులు సహా మైనార్టీలంతా సేఫ్ గా బతుకుతున్నారు. వాళ్ళ హక్కులు కూడా కాపాడుతున్నాయి అక్కడి ప్రభుత్వాలు. కానీ పాకిస్తాన్ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ లో మైనారిటీలను ఎందుకు అణచివేస్తున్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ ఇస్కాన్ ప్రతినిధుల నుంచి వినిపిస్తోంది. అయితే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్ చేస్తున్న… పెద్ద పెద్ద యుద్ధాలనే ఆపలేని దీన స్థితిలో ఉంది ఐక్యరాజ్యసమితి. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కొత్తగా పీకేది ఏముంది. మన కంఠ శోష తప్ప.
కాంగ్రెస్ నోరెత్తదా ?
మన దేశంలో పరమత సహనం, లౌకిక వాదం అంటూ గొంతెత్తి అరిచే కాంగ్రెస్ (Congress) దాని మిత్రపక్షాలు, కమ్యూనిస్టులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. లౌకికవాదం అనేది హిందూయేతర మతాలకు మాత్రమే వర్తిస్తుందా ? హిందువుల విషయంలో అలాంటి ధోరణి ఎందుకు కనిపించదు. భారతోలోనే ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ సహా దాని మిత్ర పక్షాలు సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఇక బంగ్లాదేశ్ సంగతి ఎలా మాట్లాడతాయని బీజేపీ (BJP) లీడర్లు చేస్తున్న విమర్శల్లో తప్పులేదనిపిస్తోంది. అధికారం కోసం హిందూయిజాన్ని పక్కనబెట్టి ఆవురావురంటూ కాంగ్రెస్ తో జతకట్టిన శివసేన (ఉద్దవ్ థాకరే) కి (Shivsena) మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో భారీగా ఎదురు దెబ్బ తగిలింది. అయినా ఇంకా బుద్ధి రాలేదని అనిపిస్తోంది. జీవితాంతం హిందూయిజంతో బతికిన టైగర్ భాల్ థాకరే (Bal Thackery) వారసుడైన ఉద్ధవ్ కూడా హిందువుల విషయంలో జరుగుతున్న దాడులపై స్పందించలేని దుస్థితిలో ఉన్నాడు.
హిందువులంతా ఏకం కావాలి : పవన్ కల్యాణ్
బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) తీవ్రంగా స్పందించారు. అక్కడి మైనార్టీలకు రక్షణ కల్పించేలా ఆపద్ధర్మ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులకు జరుగుతున్న అన్యాయంపై ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపు ఇచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడాలనే ప్రయత్నంలో ఉన్న పవన్ .. బంగ్లా విషయంలో వెంటనే స్పందించడం… అది కూడా ఢిల్లీలోనే మాట్లాడటం గ్రేట్.