CIBIL Score News: మనకు Personal Loan, Home Loan… ఇలా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్ రావాలంటే తప్పనిసరిగా CIBIL స్కోర్ Good గా ఉండాలి. లోన్స్, క్రెడిట్ కార్డుల బాకీలు చెల్లించని పరిస్థితిల్లో డిఫాల్ట్ అయితే CIBIL Score పడిపోతుందని అందరికీ తెలుసు. అయితే ఈ CIBIL స్కోర్ విషయంలో గతంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు చేస్తున్న తప్పులకు Reserve Bank of India చెక్ పెట్టబోతోంది. సిబిల్ స్కోర్ పై 2025 జనవరి 1 నుంచి రూల్స్ మారబోతున్నాయి.
ఈ web story చూడండి.: మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా ?
దేశంలో Credit Information Bureau India Limited, Experian, High Mark, Equifax అనే నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కస్టమర్లకు Credit Score అందించడానికి RBI నుంచి పర్మిషన్ పొందాయి. ఈ Credit score వల్లే వినియోగదారులకు లోన్స్ వస్తాయని తెలుసు. కానీ ఆ సంస్థలు చేస్తున్న కొన్ని తప్పుల వల్ల కూడా క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రభావం పడుతోంది. దాంతో వినియోగదారుడు నష్టపోతున్నాడు. అందుకే రిజర్వు బ్యాంక్ క్రెడిట్ స్కోర్ కి సంబంధించి కొన్ని రూల్స్ విధించింది.
15 రోజులకోసారి CIBIL Score update
RBI కొత్త రూల్స్ ప్రకారం 2025 జనవరి1 తర్వాత నుంచి కస్టమర్ల క్రెడిట్ స్కోర్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి క్రెడిట్ బ్యూరో సంస్థలు అప్‌డేట్ చేయాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ స్కోర్‌ను త్వరగా update చేయాలని RBI సూచించింది. దాంతో వచ్చే జనవరి 1st తర్వాత కస్టమర్ల Credit Scoreను ప్రతి నెలా 15 నాడు ఆ తర్వాత నెలాఖరులో బ్యాంకులు అప్‌డేట్ చేస్తాయి.
ఇది కూడా చదవండి : Cibil Score : సిబిల్ స్కోర్ చూస్తున్నారా ! ఎఫెక్ట్ పడుతుందా ?
బ్యాంకుల తప్పుకు కస్టమర్ బలి !
మనం లోన్ కోసం అప్లయ్ చేసినప్పుడు బ్యాంకులు లేదా NBFCలు మన క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేస్తుంటాయి. అయితే అలా తనిఖీ చేసినప్పుడు తప్పనిసరిగా కస్టమర్‌కు సమాచారం పంపాలని Reserve Bank అన్ని Credit information companiesలను ఆదేశించింది. ఈ సమాచారాన్ని SMS లేదా E-Mail రూపంలో కస్టమర్ కి పంపాలి. మనం లోన్ కి అప్లయ్ చేసినా… చేయకున్నా కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తరుచుగా మన Credit Score ని తనిఖీ చేయడం వల్ల… మన స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని సంస్థలు ఇలాంటి ఫ్రాడ్స్ కి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై భారీగా ఫిర్యాదులు రావడంతో అందుకే RBI ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్ కి తెలపకుండా Credit Score ని చెక్ చేయవద్దని ఆదేశించింది.
CIBIL Score FREE
కొత్త రూల్ ప్రకారం కస్టమర్‌కు ఏదైనా రిక్వెస్ట్ పెట్టినప్పుడు… దాన్ని తిరస్కరిస్తే… ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం తప్పనిసరిగా బ్యాంకులు, సంస్థలు తెలపాలి. దాంతో తమ తప్పు ఎక్కడ జరిగిందో కస్టమర్ తెలుసుకోడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే కస్టమర్ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేయడానికి కారణాలను బ్యాంకులు, ఇతర NBFCలు క్రెడిట్ సంస్థలకు పంపాలి. Credit information companies ఏడాదికి ఒకసారి కస్టమర్లకు పూర్తి క్రెడిట్ స్కోర్స్ Freeగా అందించాలి. అందుకోసం ఆ కంపెనీ తమ website లో లింక్‌ను చూపించాలి. దాంతో కస్టమర్లు తమ క్రెడిట్ నివేదికను ఉచితంగా తనిఖీ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి : Digital Loans : యాప్ లోన్ కావాలా? జాగ్రత్త… దెబ్బయిపోతారు !
Credit Score సమస్యలకు పరిష్కారం !!
కస్టమర్ డిఫాల్ట్ అయితే దానిని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు… క్రెడిట్ కంపెనీలకు తెలియజేసేముందు కస్టమర్ కి తప్పకుండా తెలియజేయాలి. లోన్ జారీ చేసిన సంస్థలు SMS/ఈ-మెయిల్ ను ఆ కస్టమర్ కి పంపాలి. అంతేకాదు బ్యాంకులు, రుణ సంస్థలు నోడల్ అధికారులను కూడా నియమించాలి. క్రెడిట్ స్కోర్ కి సంబంధించి ఆయా బ్యాంకుల వల్ల సమస్యలు వస్తే పరిష్కరించడానికి నోడల్ అధికారులు పనిచేయాలని రిజర్వు బ్యాంక్ రూల్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఒక్కోసారి మనం లోన్ మొత్తం రీపేమెంట్ చేసినా… మనకు తెలియకుండా రూపాయి, రెండు రూపాయల బాకీ మిగిలిపోయింది అనుకోండి… అది కూడా మన సిబిల్ స్కోర్ ని తగ్గిస్తుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలకు ఈ విషయం వెల్లడించేముందు బ్యాంకులు కస్టమర్లకు విధిగా తెలియజేయాలి. దాన్ని పరిష్కరించుకునేందుకు కస్టమర్లకు నోడల్ అధికారులు సాయం చేయాలి.
30 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే !
Credit Inforamtion companies లు కూడా కస్టమర్ల నుంచి కంప్లయింట్స్ వస్తే దాన్ని నెల రోజుల్లగా (30 రోజులు) పరిష్కరించాలి. గడువులోపు ఆ సమస్యను పూర్తి చేయకపోతే… లేట్ అయిన ప్రతి రోజుకు రూ.100 చొప్పున కస్టమర్ కి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ 30 రోజుల్లో… సమస్య పరిష్కారానికి రుణం పంపిణీ చేసిన బ్యాంకులు, లేదా ఇతర సంస్థలకు 21 రోజులు, క్రెడిట్ బ్యూరోకు తొమ్మిది రోజులు టైమ్ వస్తుంది. 21 రోజుల్లోగా బ్యాంక్ క్రెడిట్ బ్యూరోకు తెలియజేయకపోతే బ్యాంక్ కస్టమర్ కి పరిహారం చెల్లించాలి. బ్యాంకు నుంచి సమాచారం అందిన తొమ్మిది రోజుల తర్వాత కూడా కంప్లయింట్ పరిష్కరించకపోతే క్రెడిట్ బ్యూరో పరిహారం చెల్లించాల్సి ఉంటుందని RBI కొత్త నిబంధనల్లో పేర్కొంది.
CIBILస్కోర్ విషయంలో RBI విధించిన ఈ కొత్త నిబంధనలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి.
==================================================
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న Telugu word website కి సంబంధించి ఈ కింది లింక్ ద్వారా Telegram Group లో జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచి Telugu Word ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్ గా చేసుకోండి. Thank you.
====================================================