ఆ ఏరియాలో భూములకు ఫుల్ డిమాండ్

Latest Posts Real Estate Top Stories Trending Now

Hyderabad Real Estate : హైదరాబాద్ నగర శివారు మున్సిపాలిటీల్లో ఇళ్ళు, స్థలాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం, చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ప్రాంతాల్లో కొనుగోళ్ళకు డిమాండ్ ఏర్పడింది. ఏ ఏరియాలో ఇళ్ళకు డిమాండ్ ఉంది ? అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

సొంతింటి కల నెరవేర్చుకోడానికి మధ్యతరగతి జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఇల్లు గానీ, ఇళ్ళ స్థలం గానీ కొనే పరిస్థితి లేదు. హైరేట్లు పలుకుతుండటంతో మిడిల్ క్లాస్ బేజార్ అవుతోంది. అందుకే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇళ్ళు, ఇండ్ల స్థలాల కోసం వెతుకుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో… బాట సింగారం, పిగ్లిపూర్, మజీద్ పూర్, యాదాద్రి భువనగిరి జిల్లాలో National Highway కి రెండు వైపులా 5,6 కిలోమీటర్ల పరిధిలోని ఏరియాల్లో Real Estate సంస్థలు భారీగా లే ఔట్లు వేస్తున్నాయి. అటు చౌటుప్పల్ దాకా విల్లా ప్రాజెక్టులతో పాటు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లను వేస్తున్నారు.

Read this also : Pre Launch Cheating : బీకేర్ ఫుల్… ప్రీ లాంచ్ మాయలో పడొద్దు !

Real estate

ఏం సౌకర్యాలు ఉన్నాయంటే …

హైదరాబాద్ శివారుల్లోని నేషనల్ హైవే విస్తరణ పనులు నడుస్తున్నాయి. ఫ్లై ఓవర్లు కూడా పూర్తయితే సిటీ లోపలికి రావడానికి పెద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఉండే ఛాన్స్ లేదు.
ప్రస్తుతం హైదరాబాద్ లో మెట్రో రైలు LB నగర్ వరకు మాత్రమే ఉంది. దీన్ని హయత్ నగర్ వరకూ second phase లో విస్తరించబోతున్నారు. ఐదేళ్ళల్లో ఇది పూర్తవుతుంది. దాంతో ఇండ్ల అమ్మకాలకు డిమాండ్ పెరుగుతోంది.

🏠 ప్రస్తుతం LB నగర్ నుంచి చౌటుప్పల్ కు RTC భారీగా బస్సులను నడుపుతోంది. దాంతో సిటీలోకి జనం రావడానికి ఇబ్బందులు లేవు.

🏠 శివారు ప్రాంతాల్లోనే స్కూళ్ళు, ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాంతో పిల్లల చదువులకు సిటీలోకి రావాల్సిన అవసరం కూడా లేదు.

🏠 ఇంకా ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్ పార్కులతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

🏠 బాట సింగారం ఏరియాలో ఫ్రూట్ మార్కెట్ ఉండటంతో సిటీకి వచ్చి పోయే చిరు వ్యాపారుల సంఖ్య పెరిగింది. రాబోయే రోజుల్లో వీళ్ళు కూడా ఈ ఏరియాల్లో నివసించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Real estate

అబ్దుల్లాపూర్ మెట్ లో ధరలు ఎలా ఉన్నాయి?

🏠 అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని రిజిస్ట్రేషన్ విలువ గజానికి రూ.2100 ఉంది. బహిరంగ మార్కెట్లో అలాగే HMDA లే ఔట్లలో గజం రూ.10 వేల నుంచి 30 వేల దాకా పలుకుతున్నట్టు రియల్టర్లు చెబుతున్నారు.

🏠 నేషనల్ హైవేకి దగ్గరల్లో ఉన్న ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ రేట్లు ఉన్నాయి. హైవేకి కొద్దిగా దూరంలో ఉన్న గ్రామాల్లో రూ.10 వేల నుంచి 15 వేల దాకా పలుకుతున్నాయి.

🏠 ఇనాంగూడ, లష్కర్ గుడ, బాట సింగారం గ్రామాల పరిధిలోని HMDA లే ఔట్స్ లో గజం రూ.20 వేల నుంచి 25 వేల దాకా రేట్లు ఉన్నాయి.

🏠 పిగ్లిపూర్ పరిధిలో HMDA లే ఔట్లలో రూ.15 వేల నుంచి 20 వేల దాకా పలుకుతోంది.

Read Also : మీ కంచంలో ప్రొటీన్స్ ఉన్నాయా ?

ట్రిపుల్ R వస్తే ఇంకా డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ నిర్మాణం మొదలుపెట్టింది. భవిష్యత్తులో ఈ ఏరియాలో రేట్లు మరింత పెరిగే ఛాన్సుంది అంటున్నారు. అందుకే కొందరు పెట్టుబడుల కోసమే బాట సింగారం ఏరియాలో భూములు కొంటున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఇళ్ళ స్థలాలు కొనాలని భావించే వారికి బాట సింగారం బెస్ట్ ఛాయిస్ అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

Amazon Affiliated 

ZasaDecor Metal Sun With Flying Birds Set Of 8 Wall Art For Bedroom/Living Room/Hotels (65 Inch, Electroplated Gold)

You can buy with this Link : https://amzn.to/42ICjU4

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Tagged