‘ENE రిపీట్’ టైటిల్ తో ఫుల్ ట్రీట్

ET World Latest Posts Trending Now

‘ఈ నగరానికి ఏమైంది’ మూవీకి సీక్వెల్

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా యూత్ ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఊహించని ట్రీట్ గా నిలిచిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా రీరిలిజ్ మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. దీంట్లో పాత్రలు, హ్యూమర్, లైఫ్ కి కనెక్ట్ అయ్యే కథతో ఈమూవీ మ్యాసీవ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ను అనౌన్స్‌ చేశారు. ‘ENE రిపీట్’ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మళ్ళీ అదరగొట్టబోతోందనే హామీ ఇస్తోంది. దాదాపు ఒరిజినల్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం తో తిరిగి వస్తున్న ఈ సీక్వెల్ నోస్టాల్జియా ఫీలింగ్ ని కలిగిస్తుంది.

ఫస్ట్ పార్ట్ లో అందరినీ అలరించిన గ్యాంగ్ విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను మరోసారి మ్యాడ్‌నెస్ క్రియేట్ చేయబోతున్నారు. ఒరిజినల్ ని క్రియేట్ చేసిన క్రియేటివ్ పవర్ హౌస్ తరుణ్ భాస్కర్ ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై డి. సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు.
టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఒక హిలేరియస్ ట్రీట్ లా వుంది. ఈ సీక్వెల్ కి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఒరిజినల్ కంపోజర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న సిరీస్ సిగ్నేచర్ వైబ్‌ను కొనసాగిస్తున్నారు. AJ ఆరోన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్. సౌమిత్రి ఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.

Also read: సమంత, రకుల్ కి నోటీసులిస్తారా ?

Also read: రాహుల్.. రేవంత్ తరపున సారీ చెప్పు

Also read: సీఎం కాన్వాయ్ కే.. నీళ్లు కలిపిన డీజిల్

Also read: https://www.telugutimes.net/en/cinemas/cinema-news/tharun-bhascker-s-originals-and-suresh-productions-cult-sequel-ene-repeat-announced-320639.html

Tagged

Leave a Reply